సికింద్రాబాద్, వెలుగు : దేశంలో గంగా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి మే 9 వరకు దక్షిణ మధ్య రైల్వే 18 స్పెషల్ట్రైన్లను నడుపనుంది. మన రాష్ట్రంలో సికింద్రాబాద్,-రక్సాల్ మధ్య ఈ నెల 23, 30, మే 7న ఈ రైళ్లను నడుపనుంది. అలాగే రక్సాల్–- సికింద్రాబాద్మధ్య ఈ నెల 25, మే2,9 తేదీల్లో పరుగులు పెడతాయి.
తిరుపతి–- దనాపూర్ మధ్య ఈ నెల 22,29, మే6 తేదీల్లో , ధనాపూర్– -తిరుపతి మధ్య ఈ నెల 24, మే1,8 తేదీల్లో నడుస్తాయి. గుంటూరు– -బెనారస్ మధ్య ఈ నెల 24, 29, మే 6వ తేదీల్లో ..బెనారస్– -గుంటూరు మధ్య ఈ నెల 24, మే 1,8వ తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి.ఏసీ2 టయర్, ఏసీ 3 టయర్, ఏసీ 3 టయర్ఎకానమి, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో పాటు జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయి. శుక్రవారం నుంచి ప్యాసింజర్లు టికెట్లు బుక్‌చేసుకోవచ్చు.
