
భారతీయులు గర్వపడేలా.. విశ్వవేదికపై తెలుగు జాతి కీర్తిని చాటేలా ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను అందుకుంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఆస్కార్ సంబురాలు ముగియడంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చూశారు.. ఎవరి పేరు ఎక్కువగా వినిపించింది లాంటి వివరాలను ప్రకటించారు. వరల్డ్‌వైడ్‌గా 18.7 మిలియన్ల మంది చూశారని, ఈవెంట్‌ను లైవ్ టెలికాస్ట్ చేసిన ఏబీసీ సంస్థ తెలిపింది. గతేడాదితో పోలిస్తే వ్యూయర్స్ సంఖ్య 12 శాతం పెరిగింది. ఇక న్యూస్ మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువసార్లు ప్రస్తావించిన యాక్టర్స్ లిస్ట్ (టాప్ మేల్ మెన్షన్స్)ను సోషల్ మీడియాను విశ్లేషించే ‘నెట్ బేస్ క్విడ్’ సంస్థ అనౌన్స్ చేసింది.
ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. అంతేకాదు.. తర్వాతి స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ అందుకున్న ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ నటుడు కె.హుయ్ ఖ్యాన్, బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్ ఉన్నట్లు నెట్ బేస్ క్విడ్ సంస్థ ప్రకటించింది. అలాగే మీడియాలో ఎక్కువసార్లు ప్రస్తావించిన సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం మరో విశేషం. తర్వాతి స్థానాల్లో ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనియా 1985 చిత్రాలు నిలిచాయి.