ఢిల్లీలో పిట్టల్లా రాలుతున్న జనం... ఎండలకు 192 మంది మృతి

ఢిల్లీలో పిట్టల్లా రాలుతున్న జనం... ఎండలకు   192 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మాములుగా లేవు. దంచికోడుతున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి  పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ కేసులు కూడా పెరిగిపోతున్నాయి.  గడిచిన 72 గంటల్లో ఐదుగురు మృతి చెందారు.  జూన్ 11 నుండి జూన్ 19 మధ్య ఢిల్లీలో వడదెబ్బ కారణంగా మొత్తం 192 మంది నిరాశ్రయులు మరణించారని ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ తన రిపోర్టులో పేర్కొంది. 

వడదెబ్బ కారణంగానే వీరంతా చనిపోయినట్లుగా వెల్లడించింది.  గత ఐదేళ్లలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే అని ఎన్జీవో తెలిపింది.  నోయిడాలో కూడా హీట్ స్ట్రోక్ కారణంగా గత 24 గంటల్లో 14 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. హీట్‌వేవ్‌ల కారణంగా మరణించిన వ్యక్తులలో క్లెయిమ్ చేయని మృతదేహాలలో 80 శాతం మంది నిరాశ్రయులని NGO అధ్యయనం పేర్కొంది. ఢిల్లీలో బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశముందని, రేపు, ఎల్లుండి కాస్త ఉపశమనం ఉండవచ్చునని వాతావరణ శాఖ వెల్లడించింది.