జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 14న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. నియోజకవర్గంలో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 4లక్షల 13వందల 65 ఓట్లకు సగం ఓట్లు కూడా పోలవ్వలేదు. నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో మొత్తం లక్షా 94 వేల 631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
పొలిటికల్ పార్టీలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నాయి పలానా డివిజన్ లో తమకే ఎక్కువ లీడ్ వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. అయితే డివిజన్ల వారీనీ ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే..అత్యధికంగా బోరబండ డివిజన్ లో 55.92 శాతం అత్యల్పంగా సోమాజీగూడలో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి
డివిజన్ల వారీగా పోలైన ఓట్లు
బోరబండ డివిజన్
- మొత్తం ఓట్లు 53,211
- పోలైన ఓట్లు 29,760(55.92శాతం)
రహమత్ నగర్
- మొత్తం ఓట్లు 74,387
- పోలైన ఓట్లు 40,610(54.59 శాతం)
ఎర్రగడ్డ డివిజన్
- మొత్తం ఓట్లు 58,752
- పోలైన ఓట్లు 29,112(49.55శాతం)
వెంగళ్ రావు నగర్
- మొత్తం ఓట్లు 53,595
- పోలైన ఓట్లు 25,195(47.00శాతం)
షేక్ పేట్ డివిజన్
- మొత్తం ఓట్లు 71,062
- పోలైన ఓట్లు 31,182( 43.87శాతం)
యూసఫ్ గూడ్ డివిజన్
- మొత్తం ఓట్లు 55,705
- పోలైన ఓట్లు 24219(43.47శాతం)
సోమాజీగూడ డివిజన్
- మొత్తం ఓట్లు 34,653
- పోలైన ఓట్లు14,553( 41.99 శాతం)
