ఢిల్లీ ఎయిమ్స్ లో 195 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

ఢిల్లీ ఎయిమ్స్ లో 195 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. సామాన్య ప్రజలతో పాటు…చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా వైరస్ భారిన పడుతున్నారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఇప్పటివరకు 195 సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. గత రెండు రోజుల్లోనే 50 మంది సిబ్బందికి ఈ వైరస్ సోకింది. వీరిలో ఎంబీబీఎస్‌ విద్యార్థితో పాటు రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సులు, మెస్‌ వర్కర్లు, లేబోరేటరీ సిబ్బంది, సాంకేతిక సహాయకులు, శానిటేషన్ వర్కర్లు, భద్రతా విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు.

ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు కరోనా సోకిన 195మందిలో టీచింగ్ సిబ్బంది, రెసిడెంట్‌ డాక్టర్లతో పాటు 21 నర్సింగ్‌ సిబ్బంది, ఎనిమిది మంది టెక్నీషియన్లు, 32మంది శానిటేషన్‌ వర్కర్లు, 68మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు ఈ వైరస్‌ లక్షణాల నుంచి కోలుకొని మళ్లీ విధుల్లోకి హాజరు కాగా.. మిగతా వారంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ ఆదివారం శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి చనిపోయాడు.