
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 197 ఫిర్యాదులు వచ్చాయి. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో అధికారులు 121 ఫిర్యాదులు స్వీకరించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదులను పరిశీలించి తర్వగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, ఇన్చార్జి ఆర్డీవో స్రవంతి, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి కలెక్టరేట్లో 76 ఫిర్యాదులు
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లోని ప్రజావాణికి 76 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ ఫిర్యాదులు స్వీకరించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుత ఫిర్యాదులతోపాటు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్సెస్సీలో అత్యధిక
మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు.