వెస్ట్ ఇండీస్ తో భారత్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ ఫస్ట్ వన్డే ప్రారంభమైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ఫస్ట్ మ్యాచ్ గెలిచి సత్తా చాటుతామని విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తెలిపాడు. తమ టీమ్ లో బ్యాటింగ్, బౌలింగ్ బాగుందన్నాడు. ఇండియా విషయానికొస్తే ఇటీవల పెర్ఫామెన్స్ చూసినా ఈ సిరీస్‌లో ఇండియానే ఫేవరెట్‌గా కనిపిస్తుంది. రోహిత్ గైర్హాజరీలో శిఖర్ ధవన్ రెండోసారి టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు.
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన విండీస్... బలమైన ఇండియాకు ఏ మేరకు పోటీనిస్తుందన్నది ఆసక్తిగా మారింది. వన్డేల్లో రీఎంట్రీ ఇస్తున్న ఆల్ రౌండర్ హోల్డర్‌పై భారీ అంచనాలున్నాయి. కానీ, కెప్టెన్ పూరన్ బ్యాటింగ్ ఫామ్‌పై ఆందోళన కొనసాగుతున్నది. స్టార్టింగ్‌లో హోప్, కింగ్.. ఇండియన్ పేసర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మిడిల్‌లో పావెల్, మేయర్స్, హోల్డర్ అత్యంత కీలకం. వీళ్లు నిలబడితేనే కరీబియన్లు కనీసం మొత్తం ఓవర్లు ఆడగలరు. 2019 వన్డే వరల్డ్‌కప్ నుంచి విండీస్ 39 ఇన్నింగ్స్‌లో ఆరుసార్లు మాత్రమే 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడం గమనార్హం.
టీమ్స్
A look at our Playing XI for the 1st ODI.
— BCCI (@BCCI) July 22, 2022
Live - https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/WuwCljou75
1ST ODI. West Indies XI:, S Hope (wk), B King, S Brooks, N Pooran (c), R Powell, R Shepherd, K Mayers, A Hosein, J Seales, G Motie, A Joseph. https://t.co/g4AwFB58vs #WIvIND
— BCCI (@BCCI) July 22, 2022
