
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇంటెలిజెన్స్ సమాచారంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. దీంతో జెడ్డా నుంచి వచ్చిన నలుగురు మహిళలను, వారి బ్యాగులను చెక్ చేశారు. ఆ మహిళా ప్రయాణీకుల వద్ద నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణీకుల వద్ద బంగారాన్ని పట్టుకోగా.. అందుకు తగిన పత్రాలను చూపెట్టలేదని తెలిపారు అధికారులు.