
అస్సాంలో దారుణం జరిగింది.. ఇన్ఫెక్షన్ సోకిందని ఆసుపత్రికి వెళ్తే.. బయాప్సీ టెస్ట్ చేయాలని చెప్పి ఏకంగా యువకుడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేశారు. అస్సాంలోని మణిపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మణిపూర్ లోని జిరిబామ్ జిల్లాకు చెందిన అతికుమార్ రెహ్మాన్ అనే యువకుడు ప్రైవేట్ పార్ట్స్ కి ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం సిల్చార్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాడు. ఈ క్రమంలో బయాప్సీ సహా పలు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు వైద్యులు.
ALSO READ |18 ఏళ్ల నిరీక్షణకు తెర: ఆఖరికి AI సాయంతో గర్భం దాల్చిన మహిళ !
బయాప్సీ పరీక్ష కోసం తనకు ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారని.. అక్కడ తన అనుమతి లేకుండానే ఆపరేషన్ చేసి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేశారని ఆరోపిస్తున్నాడు రెహ్మాన్. ఆపరేషన్ పూర్తయ్యాక డ్రెస్సింగ్ తొలగించే సమయంలో తన ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన విషయం తనకు అర్థమైందని అంటున్నాడు బాధితుడు. బయాప్సీ టెస్ట్ కోసం టిష్యూ శాంపిల్ తీసుకోవాలని చెప్పి ఈ దారుణానికి పాల్పడ్డారని వాపోతున్నాడు బాధితుడు.
డ్రెస్సింగ్ తీసేసాక తన ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన విషయం అర్థమైందని... ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో డాక్టర్ ను కలవడానికి వెళ్తే సిబ్బంది అడ్డుకున్నారని తెలిపాడు బాధితుడు. చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.