
ట్రేడ్ డీల్స్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. జులై 9 డెడ్ లైన్.. అంతలోపు మాతో వాణిజ్య ఒప్పందం చేసుకోండి.. లేదంటే యూఎస్ విధించే టారిఫ్ లు భారీగా ఉంటాయని రోజూ హెచ్చరిస్తూనే ఉన్నారు. వియత్నాం లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే ట్రంప్ తో డీల్స్ కుదుర్చుకున్నాయి. అయితే ట్రంప్ టార్గెట్ ఇండియా, చైనా లాంటి పెద్ద దేశాలు. ఇండియా తమ దేశంపై అధిక టారిఫ్ లు వేస్తోందని.. మేము అంతకు మించి వేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. డెడ్ లైన్ లోపు ఒప్పందం చేసుకోకుంటే భారీగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.
ALSO READ | ఆర్థిక నేరగాళ్ల లగ్జరీ పార్టీ:లలిత్ మోడీ విందులో మాల్యా పాటల కచేరి
దీనిపై ఇండియా స్పందించింది. యూఎస్ డెడ్ లైన్ ఆధారంగం డీల్ కుదుర్కుచోమని అన్నారు వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్. శుక్రవారం (జులై 4) టారిఫ్ గడువుపై మాట్లాడిన ఆయన.. దేశ ప్రయోజనాల ఆధారంగా డీల్స్ ఉంటాయని.. డెడ్ లైన్స్ ఆధారంగా కాదని చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో భారత్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని అన్నారు.
ఇండియాపై అధిక టారిఫ్ వేస్తామని చెప్పి.. యూఎస్ గూడ్స్ పై తక్కువ టారిఫ్ వేయించేలా ఒత్తిడి చేస్తూ వస్తు్న్నారు ట్రంప్. యూఎస్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ గూడ్స్, అగ్రికల్చర్ గూడ్స్ (వ్యవసాయ ఉత్పత్తులు) తక్కువ పన్ను ధరలకే భారత్ కు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివిధ దేశాలతో ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. యూరోపియన్ యూనియన్, ఒమన్, న్యూజీలాండ్, పెరూ, చిలీ, యూఎస్.. తదితర దేశాలతో చర్చలు నడుస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. రెండు దేశాలకు లాభం చేకూర్చే సందర్భంలో ఫ్రీ ట్రేడ్ బెటర్ అని అన్నారు. డెడ్ లైన్ ఆధారంగా ఇండియా ఎప్పటికీ డీల్స్ కుదుర్చుకోదని.. దేశ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.