వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫొటో: అకీరా, మార్క్ శంకర్‌లతో పవర్ స్టార్!

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫొటో: అకీరా, మార్క్ శంకర్‌లతో పవర్ స్టార్!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే  'హరి హర వీరమల్లు'  మూవీ ట్రైలర్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిందిగా రికార్డు సృష్టించింది. తెలుగు ట్రైలర్ కు 48 మిలియన్ల వ్యూస్ సాధించింది.   సాధారణంగా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను, కుటుంబ సభ్యుల ఫొటోలను పెద్దగా బయట పెట్టరు.  అటు తన  అభిమానులు ఎప్పుడూ ఆయన సినిమాల గురించి, రాజకీయాల గురించే ఎక్కువగా చూస్తుంటారు. 

అలాంటి పవన్ కళ్యాణ్.. తన ఇద్దరు కుమారులైన అకీరా నందన్ (రేణు దేశాయ్ కుమారుడు), మార్క్ శంకర్ పవన్ బాబు (అన్నా లెజ్నెవా కుమారుడు)తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. దీంతో అభిమానుల ఆనందాలకు హద్దులులేకుండా పోయింది. లైకుల వర్షం కురిపించేస్తూ ప్రశంసలు కురించేస్తున్నారు.. 

అభిమానులను ఆకట్టుకుంటున్న బంధం
ఈ ఫొటో పవన్ అభిమానులను ఎంతగానో సంతోషానికి గురి చేసింది. ఇద్దరు కుమారులు పవన్ కళ్యాణ్‌తో కలిసి నవ్వుతూ, సరదాగా మాట్లాడుతున్న తీరు ప్రశంసలు కురించేస్తున్నారు. ముఖ్యంగా, అకీరా, మార్క్ శంకర్‌లు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదు.  అలాంటిది ఈ ఫోటోలో ముగ్గురు ఒకే ఫోటోలో కన్పించే సరికి అభిమానులు ఆనందం అంతా ఇంతా కాదు. ఇది పవన్ కుటుంబంలో ఉన్న బంధాన్ని, ప్రేమను చాటి చెబుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఫొటో 
ఈ ఫొటో కేవలం అభిమానులను ఆకట్టుకోవడమే కాదు, పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతను కూడా తెలియజేస్తోందంటున్నారు ఫ్యాన్స్.  బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, పిల్లలతో గడిపే సమయాన్ని ఆయన ఎంతగానో విలువ ఇస్తారని ఈ ఫొటో స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో వేలల్లో షేర్లు, కామెంట్లు, లైక్‌లతో ఈ ఫొటో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. పవర్ స్టార్ అభిమానులు ఈ ఫొటోను తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకుని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు