AI నుండి ఈ ఉద్యోగాలు సేఫ్.. కానీ జాగ్రత్తగా ఉండాలి: జెఫ్రీ హింటన్

AI నుండి ఈ ఉద్యోగాలు సేఫ్.. కానీ జాగ్రత్తగా ఉండాలి: జెఫ్రీ హింటన్

గత రెండేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదుగుతున్న వేగం ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. అయితే AI గురించి ఎక్కువగా భయపడుతున్నది ఉద్యోగులే. ఎందుకంటే AI వచ్చాక ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏ కంపెనీలు AIని ప్రవేశ పెట్టడం ద్వారా ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించుకున్నాయో లేక నిర్ణయం తీసుకుంటున్నాయో తెలియదు. కానీ కేవలం ఒక సంవత్సరంలోనే లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు. టెక్ నిపుణులు ఇందుకు కూడా ఎం  చేయాలో అని ఆలోచిస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే ఒక వార్త  వెలువడింది. 

అదేంటంటే AI ద్వారా  ప్రభావం కానీ  ఒక పని రంగం పేరు తెరపైకి వచ్చింది. AI గాడ్ ఫాదర్ అని పిలువబడే జెఫ్రీ హింటన్ దీని గురించి స్పందించారు. అతని సమాధానం తెలుసుకోవడం వల్ల పని అనేది చిన్నదా  లేక  పెద్దదా  అనే ఆలోచన మీకు మార్చవచ్చు.  

ALSO READ | గూగుల్ AI ఫోన్.. అక్షరాలు, ఫొటోలు ఇస్తే వీడియో చేసి ఇచ్చేస్తోంది..

 

AI ప్రవేశం లేదా వినియోగం ప్రతిచోటా పెరుగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు సురక్షితంగా ఉంటాయో ప్రజలు ఆలోచించుకోవాల్సి  వస్తుంది. AI ఏ పనైనా చేయగలదని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పటికీ మానవుల శారీరక సామర్థ్యం, చేతి పనులకి  సమానం కాలేకపోయింది. జెఫ్రీ హింటన్ ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త. AI అభివృద్ధిలో ఆయనే పెద్ద పాత్ర పోషించారు. ఇంకా AI ప్రమాదాల గురించి, సమాజంపై దాని ప్రభావం గురించి ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, ప్రస్తుతం 77 సంవత్సరాల వయస్సున్న  జెఫ్రీ హింటన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న AI గురించి  ఆందోళన వుతిక్తం చేస్తున్నారు.

అయితే స్టీవెన్ బార్ట్‌లెట్ పాడ్‌కాస్ట్ 'ది డైరీ ఆఫ్ ఎ CEO'లో జెఫ్రీ ఒక విషయాన్ని ప్రస్తావించారు. జెఫ్రీ మాట్లాడుతూ, 'మనుషుల  స్కిల్స్  అవసరమయ్యే ఉద్యోగాలు భవిష్యత్తులో AI నుండి సురక్షితంగా ఉంటాయి, వాటికి AI వల్ల ముప్పు ఉండదు. ప్లంబింగ్ వంటి ఉద్యోగాలు AI నుండి సురక్షితంగా ఉంటాయని ఆయన అన్నారు. ఇది ఒక వింత ఉదాహరణగా అనిపించవచ్చు. కానీ ప్లంబింగ్‌లో శారీరక శ్రమ ఉంటుందని ఆయన వివరించారు. దానిని ఆటోమేషన్‌తో భర్తీ చేయడం కష్టం. అకౌంటింగ్ వంటి ఉద్యోగాలు డేటాపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల వాటిని AI ద్వారా ఈజీగా భర్తీ చేయవచ్చు. ప్లంబింగ్‌కు మాన్యువల్ పని, కష్టమైన సమస్యలను పరిష్కరించడం అవసరం. ఈ ఉద్యోగాలలో AI ఇప్పటికీ మానవుల కంటే చాల వెనుకబడి ఉంది. AI అభివృద్ధి గురించి మనం జాగ్రత్తగా ఉండాలని కూడా జెఫ్రీ చెబుతున్నారు.