హైదరాబాద్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

హైదరాబాద్లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

సికింద్రాబాద్ మహాంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నప్ కలకలం రేపింది. ప్యారడైస్ చౌరస్తా దాదూస్ స్వీట్ హౌజ్ ముందు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కరిష్మా అనే 3 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన జూన్ 4వ తేదీ ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, మహాంకాళీ ఏరియా పోలీసులు గంటల వ్యవధిలోనే చిన్నారి కిడ్నాప్ కేసు ను చేధించారు. కిడ్నాప్ కు పాల్పడిన మహిళతో పాటు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే సుల్తాన్ బజార్ లో ఓ బాలుడ్ని కిడ్నాప్ చేసిన దుండగులు.. ప్యారడైస్ వద్ద చిన్నారిని కిడ్నాప్ చేసి ఆటోలో పారిపోతుండగా పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరు చిన్నారులను క్షేమంగా పోలీస్ స్టేషన్ తరలించారు. కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కర్నాటకకు చెందిన మేఘరాజ్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. ఫుట్ పాత్ పై నివసిస్తూ అక్కడే బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మేఘరాజ్ కు ఏడుగురు సంతానం అందులో ఐదుగురు అమ్మాయిలు..ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. రోజు మాదిరిగానే శనివారం బెలూన్లు అమ్ముకున్న మేఘరాజ్ రాత్రి పిల్లలతో ఫూట్ పాత్ పై నిద్రిస్తుండగా.. ఆటోలో వచ్చిన కిడ్నాపర్ప్ చిన్నారిని అపహరించారు. మేఘరాజ్ లేచి చూసే సరికి తన కూతురు కనిపించాలేదు. దీంతో కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.