V6 News

ఫోన్కు ఆర్టీవో చలాన్ పేరుతో వచ్చిన లింక్ క్లిక్ చేశాడు.. దెబ్బకు రూ.75 వేలు డెబిట్

ఫోన్కు ఆర్టీవో చలాన్ పేరుతో వచ్చిన లింక్ క్లిక్ చేశాడు.. దెబ్బకు రూ.75 వేలు డెబిట్

ఘట్​కేసర్, వెలుగు: ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్​ చీటర్లు ఓ కొరియర్​ బాయ్​ను చీటింగ్​ చేశారు. పోచారం డివిజన్ అన్నోజిగూడకు చెందిన రవీందర్(40) కొరియర్ బాయ్ గా పనిచేస్తుంటాడు. ఈ నెల 2న తన ఫోన్​కు ఆర్టీవో చలాన్ పేరుతో వచ్చిన లింక్​ను క్లిక్ చేశాడు. దీంతో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.75 వేలు డెబిట్​ అయ్యాయి. 

ఇదే డివిజన్​ లో మరో వ్యక్తి మోసపోయాడు. కొర్రెములకు చెందిన తోట ఉపేందర్(53) కాంట్రాక్టు పనిచేస్తుంటాడు. ఈ నెల 5న ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం రూ.లక్ష 50 వేలు ఇచ్చాడు. రెండు రోజులకే ఆయన ఖాతా  నుంచి మూడు దఫాలుగా రూ.లక్ష 26 వేలు మాయమయ్యాయి. బాధితులు పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.