కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ కేసు:ఇద్దరు ఇండియన్లు అరెస్ట్

కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ కేసు:ఇద్దరు ఇండియన్లు అరెస్ట్

ఒట్టావా: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ గతేడాది ఏప్రిల్ 17న టోరంటో ఎయిర్ పోర్టులో జరిగిన విషయం తెలిసిందే.. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అక్కడి పోలీసులు బుధవారం(ఏప్రిల్17) అరెస్ట్ చేశారు.. వీరిలోఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. ఈ కేసులో మరో ముగ్గురికి వారెంట్లు జారీ చేశారు. 

ఏప్రిల్17,2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల బంగారం, విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న ఎయిర్ కార్గో కంటైనర్ను దొంగిలించారు దుండగులు. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ నుంచి ఎయిర్ కెనడా విమానంలో వచ్చిన కంటైనర్ ను నకిలీ డాక్యుమెంట్లతో చోరీ చేశారు. ఈ చోరీకి ఇద్దరు ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగులు సాయం చేసి నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒకరు కస్టడీలో ఉన్నారు.. మరొకరికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు పోలీసులు. 

అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అంటారియోకు చెందిన పర్మ్ పాల్ సిద్దూ, అమిత్ జలోటా తోపాటు అమ్మద్ చైదరి, అలి రజా, ప్రసాద్ పరమలింగంను అరెస్ట్ చేశారు.  గతేడాది జరిగిన ఈ దోపిడీ కేసులో సంవత్సరం పాటు విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. దోపిడీ జరిగిన సమయంలో పరంపల్ సిద్దూ ఎయిర్ కెనడాలో పనిచేస్తున్నారు.