మలేషియాలో విరిగిపడ్డ కొండచరియలు..ఇద్దరు మృతి, 51మంది గల్లంతు

మలేషియాలో విరిగిపడ్డ కొండచరియలు..ఇద్దరు మృతి, 51మంది గల్లంతు

మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని క్యాంప్‌సైట్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు మలేషియా వెల్లడించింది. స్థానిక పోలీసుల ప్రకారం ఉదయం 7 గంటలకు 51 మంది భాధితులు తప్పిపోయినట్లు తెలిపింది. వీరిని కనిపెట్టేందుకు ఇప్పటికే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే కొండచరియలు విరిగిపడినప్పుడు మొత్తం 79 మంది శిబిరంలో ఉన్నారని న్యూ స్ట్రెయిట్ టైమ్స్ తెలిపింది. ఈ ఘటనలో 23మంది క్షేమంగా బయటపడ్డారని, మరో ముగ్గురికి గాయాలయ్యాయని ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. 

\

3 ఎకరాల విస్తీర్ణంలో 30 మీటర్ల ఎత్తులో నుంచి కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున 2:24 గంటలకు సమాచారం తెలిసిన వెంటనే. అగ్నిమాపక సిబ్బంది 3 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారని న్యూ స్ట్రెయిట్ టైమ్స్ తెలిపింది. ఈ సహాయ చర్యల్లో అగ్నిమాపక సిబ్బందితో పాటు,  వాలంటరీ ఫైర్ అసోసియేషన్, ప్రైవేట్ ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్, మలేషియా, సివిల్ డిఫెన్స్ ఫోర్స్, హెల్త్ మినిస్ట్రీ, స్మార్ట్ టీమ్ లు సైతం పాల్గొని రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.