నేను శివ భక్తుడిని..విషాన్ని దిగమింగుతా: ప్రధాని మోదీ

నేను శివ భక్తుడిని..విషాన్ని దిగమింగుతా: ప్రధాని మోదీ

మీరు ఎంత తిట్టినా.. నేను శివ భక్తుడిని, విషం అంతా దిగమింగుతాను.. కానీ ఎవరికైనా అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేను' అని ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ రెండో రోజు అస్సాంలో రూ.18,530 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. డాక్టర్ భూపెన్ హజారికాకు భారతరత్న ఇవ్వడం మంచి నిర్ణయమా? కాదా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని చెప్పారు.

 దశాబ్దాల పాటు అస్నాలను పాలించిన కాంగ్రెస్ బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు బ్రిడ్జీలే నిర్మించిందని విమర్శించారు. ఆ రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసేందుకు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ కట్టుబడి ఉందన్న పీఎం మోదీ.. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అస్సాం ఒకటిగా ఉందన్నారు. 140 కోట్ల మంది భారతీయులే తనకు ఏకైన రిమోట్ కంట్రోల్ అని పేర్కొన్నారు.