క్లాసు రూం కంటే బస్సులోనే ఎక్కువ గడుపుతున్నం..బెంగళూరు స్టూడెంట్ వీడియో వైరల్

క్లాసు రూం కంటే బస్సులోనే ఎక్కువ గడుపుతున్నం..బెంగళూరు స్టూడెంట్ వీడియో వైరల్

సిలికాన్ వ్యాలీ బెంగళూరు సిటీలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. పొద్దున లేస్తే ట్రాఫిక్ తో ఉరుకులు పరుగులు.. ఉద్యోగాలు చేసుకునే వారికి ప్రయాణంలో నిత్యం నరకమే.. బెంగళూరు ట్రాఫిక్ గురించి న్యూస్ ఛానెళ్ళు, వార్తా పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు. ఉద్యోగులు, విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టులు.. అంతలా ఇబ్బంది పెడుతుంది అక్కడ ట్రాఫిక్.. తాజాగా ముగ్గురు స్కూల్ విద్యార్థులు చేసిన రీల్స్ ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ ఎంతలా భయపెడుతుందో చూపిస్తుంది.. వివరాల్లోకి వెళితే..

బెంగళూరుకు చెందిన ముగ్గురు స్కూల్ స్టూడెంట్స్ నదియా, అన్య, మెహర్ చేసిన రీల్స్ బెంగళూరు ట్రాఫిక్ కు అద్దం పడుతున్నాయి. ఈ రీల్స్ లో ఆ ముగ్గురు విద్యార్థినిలు ట్రాఫిక్ పట్ల తమ నిరాశను వ్యక్తం చేస్తూ వైరల్ రీల్ గా మార్చారు. 

అనుకోకుండా ఆ ముగ్గురు విద్యార్థినిలు ప్రతి బెంగళూరు వాసి గొంతుగా మారారు. వైరల్ అవుతున్న రీల్స్ లో ఈ ముగ్గురు స్కూల్ బస్సు సీటులో ఇరుక్కుపోయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఎగుడుదిగుడు తమ ప్రయాణాన్ని చిత్రీకరించారు. 

ఆ అమ్మాయిలు కెమెరా ముందు తమను తాము పరిచయం చేసుకుంటూ మేము ఎక్కువ సమయం గడిపేది ఇక్కడేఈ బస్సులోనే.. నేను నదియా.. నేను అన్య..నేను మెహర్. అంటూ ఎగుడుదిగులు రోడ్లపై జంప్ చేస్తున్న బస్సులో రీల్స్ చేశారు. మేం నటించడం లేదు.. నిజంగానే బెంగళూరు రోడ్లు ఇల్లా ఉన్నాయి. అని వారు గుంతల కుదుపులో మాట్లాడారు. 

►ALSO READ | ప్రధాని మోడీ తల్లి AI వీడియో ఎఫెక్ట్: కాంగ్రెస్ పార్టీపై ఢిల్లీలో కేసు నమోదు

కేవలం 14 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలంటే రెండు గంటలకు పైనే సమయం పడుతుంది.. ఉదయం సాయంత్రం ప్రయాణంతో స్కూళ్లో కంటే బస్సుల్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. చదువుకునేందుకు సమయం దొరకడంలేదు. గుంతల మయమైన రోడ్లతో కొన్ని కొన్ని సార్లు గాయాలవుతున్నాయని విద్యార్థునిలు వాపోయారు. 

మేం చెప్పేది అబద్ధం కాదు.. కొన్ని కొన్ని సార్లు ఈ బస్సుకంటే మేం వేగంగా ఇంటికి పరుగెత్తవచ్చు.. ఇది అతిశయోక్తికాదు.. ప్లీజ్ మాకు సాయం చేయండి అంటూ రీల్స్ లో రిక్వెస్ట్ చేశారు. 

ఈ వీ డియో నెటిజన్లలో కోపం తెప్పించింది.. 

ఈ వీడియో పబ్లిక్ అవ్వడానికి కొన్ని గంటల ముందు పాణత్తూరు-బాలగెరె మార్గంలో ఓ స్కూల్ బస్సు పడిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. ఈ సంఘటనను బెంగళూరు ప్రపంచ స్థాయి గుంతలకు ప్రైజ్ ఇవ్వవచ్చన్నారు. ఈ రీల్‌ను కర్ణాటక పోర్ట్‌ఫోలియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది..

 ఇక ఓ నెటిజన్ స్పందిస్తూ చివరకు ఎవరో రోడ్ల గురించి హైలైట్ చేస్తున్నారు అని రాశారు. మరో నెటిజన్ కామెడిగా మెట్రోలో వెళ్ళండి అంటూ సలహా ఇచ్చాడు. 
ఇంకో నెటిజన్ స్పందిస్తూ హెల్మెట్ ధరించండి అని సెటైర్లు వేశారు. ఈ స్కూల్ పిల్లలు ఫోన్లు తీసుకురావడానికి ఎలా అనుమతిస్తున్నారు?” అని మరో నెటిజన్ అడిగారు.
ఈ ప్రాంతాలే కాదు, బెంగళూరు దక్షిణ ప్రాంతం కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోదతి, హోసా రోడ్, గతహళ్లి - దయనీయమైన రోడ్లు. ఎక్కడా తారు కనిపించదు. ఈ రోడ్లపట్ల అధికారులకు ఎటువంటి తప్పుచేసిన భావన లేదు. ఇదంతా BBMP చేసింది" అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అది స్కూల్ బస్సు అయినా, ఆఫీస్ క్యాబ్ అయినా లేదా బైక్ అయినా నగరంలోని  అస్తవ్యస్తం అయిన రోడ్లు సాధారణం అయ్యారు. ముగ్గురు విద్యార్థుల ఈ చిన్న క్లిప్ నగర ప్రజలను మేల్కోలిపే అలారం లాంటిది కావచ్చని నెటిజన్లు అంటున్నారు.