గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ..యువకుడు మృతి

గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ..యువకుడు మృతి

జంషెడ్ పూర్ : సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గూడ్స్ రైలుపై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కరెంటు వైర్లు తాకి షాక్ తో మరణించాడు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో బాలుడికి గాయాలయ్యాయి. చనిపోయిన యువకుడిని ఎండీ ఫైజల్(21), గాయపడ్డ బాలుడు నవేద్ అక్తర్ (11)గా గుర్తించారు.

జంషెడ్‌ పూర్‌ లోని టాటానగర్‌ రైల్వే స్టేషన్‌ సమపంలోని సల్గాజ్ హురిలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఫైజల్‌ హైటెన్షన్‌ వైర్‌ కే అతుక్కుపోగా, అక్తర్‌.. షాక్‌ కు రైలు నుంచి కిందపడిపోయాడు. గాయపడిన నవేద్ అక్తర్ ను టాటా మెయిన్ హస్పిటల్ కి తరలించారు. గూడ్స్ రైలు నింపురా యార్డు వెళ్లాల్సిన సమయంలో సిగ్నల్‌ కోసం వేచి చూస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు రైల్వే పోలీసులు.