విండో సీటు కోసం బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు

విండో సీటు కోసం బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు

బస్సుల్లో, రైళ్లలో ప్రయాణిస్తున్నపుడు తరుచుగా వినబడే మాట విండో సీటు.. ప్రయాణంలో  విండో సీటు లో కూర్చోవాలని చాలామంది ఇష్టపడుతుంటారు. ఎవరైనా విండో సీటులో కూర్చుంటే వారిని బతిమలాడి మరీ సీటును సంపాదిస్తుంటారు. విండో సీటు అంత డిమాండ్ అన్నమాట. మంచి గాలి, ప్రయాణంలో బోర్ కొట్టకుండా  కొత్త ప్రాంతాలను చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు ఉంటారు.ఇక ఈ విండో సీటుకోసం కొందరు గొడవపడటం, కొన్నికొన్ని సమయాల్లో కొట్టుకోవడం జరుగుతుంది. అలాంటిదే బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ బస్ లో ఓ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలేంటో చూద్దాం.. 

 బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం ముదిరి  తీవ్రంగా ఘర్షణ పడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. మహిళిద్దరూ రోజూ మెజెస్టిక్ నుంచి పీణ్యకు బస్సులో ప్రయాణిస్తుంటారు.రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్ ఎక్కిన వీరిద్దరు విండో సీటు విషయంలో గొడవపడ్డారు. ఇద్దరు బాగా తిట్టుకున్నారు.. వాగ్వాదం కాస్త ముదిరింది. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా చెప్పులతో కొట్టుకుకోవడం ఫుటేజీలో కనిపిస్తోంది. తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు  పెట్టారు. ’మహిళలకు కొట్లాడటానికి , తిట్టుడానికి మగవారు దొరక్కపోతే ఇలా తమలో తామే కొట్టుకుంటారని‘ ఓ నెటిజన్  హాస్యంగా స్పందించాడు. 

ALSO READ :- ఓన్లీ నేమ్ ఛేంజర్ : కవిత

కర్ణాటక ప్రభుత్వం కొత్తగా శక్తీ స్కీమ్ ను ప్రవేశపెట్టడంతో మహిళలకు సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. దీంతో బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. దీనికి అనుగుణంగా BMTC కూడా బస్సు ప్రయాణాల ఫ్రీక్వెన్సీని పెంచినట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ చొరవ మరింత మంది మహిళలను ప్రజా రవాణాను ఉపయోగించేందుకు విజయవంతంగా ప్రోత్సహించినప్పటికీ ఇది కొన్ని సమస్యలను తీసుకువచ్చిందంటున్నా రు నెటిజన్లు.