త్వరలో కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు

త్వరలో కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు
  • రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం 
  • ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్: త్వరలో మరో 20 మంది బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెప్పారు. రా బోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ కూడా కాంగ్రస్ లో విలీనం అవుతుందని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపాలను బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని చెప్పారు. గల్లీలో ఉండాల్సిన కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలను కాపాడుకోలేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఆ సంపదతోనే ప్రధాని కావాలని కలలు కన్నారని అన్నారు. కేసీఆర్ తెలంగాణతో  పేగుబంధాన్ని తెంచుకున్నారని విమర్శించారు. విభజన సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారని ఐలయ్య చెప్పారు. ఏపీ సీఎం బాబుతో భేటీ అయ్యారని అన్నారు.

ALSO READ | మా పార్టీలోకి 12 మంది వస్తే..10 మంది ఓడిపోయిండ్రు : హరీశ్ రావు