
తూప్రాన్ , వెలుగు: కుక్కల దాడిలో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పిచ్చి కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన వారు తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తూప్రాన్ పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన విశాల్, లిఖిత దంపతుల కొడుకు అనిరుధ్(3) ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తూప్రాన్ లో ప్రాథమిక చికిత్స అనంతరం అనిరుధ్‌ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. 20 మందికి పైగా చిన్నారులకు వైద్యం అందించినట్లు తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.