హీట్ వేవ్స్​తోఢిల్లీలో 20 మంది మృతి

హీట్ వేవ్స్​తోఢిల్లీలో 20 మంది మృతి
  •  బిహార్ లోనూ 22 మంది మరణం 

న్యూఢిల్లీ, వెలుగు: తీవ్రమైన హీట్ వేవ్స్ తో నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, యూపీ, హర్యానా తో పాటు పంజాబ్, బిహార్ లో వడగాలులు పెరుగుతున్నాయి. తీవ్రమైన ఎండ, వడగాలుల ధాటికి జనం పిట్టల్లా రాలుతున్నారు. రెండు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీ – ఎన్సీఆర్ పరిధిలో 20 మంది ప్రాణాలు విడిచారు. ఢిల్లీ లో ఆర్ఎంఎల్, సప్ధర్ జంగ్, ఎల్ఎన్ జేపీ ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యల్లో వడదెబ్బ బాధితులు మృతిచెందారు.

 రామ్​మనోహర్ లోహియా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో వడదెబ్బతో దాదాపు 45– 50 మంది చేరినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా వెల్లడించారు. ఇందులో ఒక్క బుధవారమే ఏడుగురు మరణించగా.. 12 మంది రోగులు లైఫ్ సపోర్ట్  సిస్టమ్ పై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఎక్కువగా కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారన్నారు. 

ఆలస్యంగా వారిని హాస్పిటల్ కు చేర్చడం వల్ల వారు ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించారు. వడదెబ్బ బాధితుల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని, సుమారు 60–70 శాతంగా నమోదవుతున్నట్లు తెలిపారు. అలాగే నోయిడా మరో 10 మంది తీవ్ర వడగాలులతో మృత్యువాత పడ్డారు. బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది ప్రాణాలు వదిలారు.