మూడు వేదికల్లో 20 వరల్డ్‌‌‌‌ కప్‌ వార్మప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు

మూడు వేదికల్లో 20 వరల్డ్‌‌‌‌ కప్‌ వార్మప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు

దుబాయ్‌‌‌‌: వచ్చే ఏడాది జరగనున్న విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వార్మప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల వేదికలను ఐసీసీ గురువారం ప్రకటించింది. కార్డిఫ్‌‌‌‌, డెర్బీ, లాబోర్గ్‌‌‌‌ యూనివర్సిటీల్లో ఈ మ్యాచ్‌‌‌‌లు జరుగుతాయని తెలిపింది. అయితే తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. 

‘మూడు వేదికలకు గొప్ప క్రికెట్‌‌‌‌ చరిత్ర ఉంది. విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఇవి కీలక పాత్ర పోషించాయి. టోర్నీకి ముందు లోకల్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌కు విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను మరింత చేరువగా తెచ్చేందుకు ఈ మూడు వేదికలను షార్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ చేశాం’ అని ఐసీసీ పేర్కొంది. 

షెడ్యూల్‌‌‌‌ ప్రకారం వచ్చే ఏడాది జూన్‌‌‌‌ 12న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగుతాయి. 24 రోజుల పాటు 7 వేదికల్లో 33 మ్యాచ్‌‌‌‌లు జరుగుతాయి. జులై 5న లార్డ్స్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ ఉంటుంది.