మారుతీ స్విఫ్ట్.. మధ్య తరగతి నమ్మకం.. 20 ఏళ్లుగా ఆగని ప్రయాణం..!

మారుతీ స్విఫ్ట్.. మధ్య తరగతి నమ్మకం.. 20  ఏళ్లుగా ఆగని ప్రయాణం..!

గత రెండు దశాబ్దాలుగా.. అంటే 20 ఏళ్లుగా అప్పటికీ.. ఇప్పటికీ అదే జోరు.. అంతకు మించిన స్పీడు. కారు కొనాలనే కలల్ని తీర్చి మిడిల్ క్లాస్ ఇంట్లో భాగమైన మారుతి స్విఫ్ట్.. ఇప్పటికీ అప్రతిహాసంగా దూసుకుపోతోంది. మార్కెట్లోకి ఎన్నో కార్లు వచ్చాయి.. పోయాయి.. కానీ ఈ కారు మాత్రం విజయవంతంగా రోడ్లపై తిరుతుందంటే.. ఎంత సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. వెర్షన్లు మారాయి.. పర్ఫామెన్స్ మారింది కానీ.. పబ్లిక్ లో ఉన్న అభిమానం మారలేదు. మారుతీ స్విఫ్ట్ 20 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ. 

మారుతీ స్విఫ్ట్ కారు.. ఇండియాలోకి 2005లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఎన్నో మార్పులు చేర్పులతో ముందుగు సాగిపోతోంది. ప్రారంభించిన కొద్దికాలంలో హాచ్ బ్యాక్ విభాగంలో టాప్ ప్లేస్ లో స్థానం సంపాదించి ఔరా అనిపించింది. (హ్యాచ్ బ్యాక్ అంటే ఇప్పుడు మనం అంటున్న  డిక్కీ. వెనక డోర్ ఉండీ లగేజ్ సదుపాయం ఉండే కార్). అంతకు ముందే ఇండియాలోకి మారుతి-1000 పేరుతో సెడాన్ అడుగుపెట్టినప్పటికీ.. స్విఫ్ట్ మిని ఇస్క్యూ డిజైన్, యూనిక్ ఇంటర్నేషనల్ స్టైలింగ్, అడ్జస్ట్ మెంట్స్ తో వచ్చిన కొద్దికాలంలో ఎంతో ఆదరణ పొందింది. 

మారుతీ నమ్మకాన్ని నిలిపిన స్విఫ్ట్:

మారుతి స్విఫ్ట్ ఇండియాలో కంపెనీ గౌరవాన్ని, నమ్మకాన్నీ నిలబెట్టిన కార్ కాబట్టే దీనికి ఇంత ప్రత్యేకత. 1.3 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన ఈ కార్ కు యూత్ లో, మిడిల్ క్లాస్ లో ఎనలేని ఆదరణ లభించింది. అప్పటి వరకు ఫ్యామిలీ మొత్తానికి ఒక కారు అన్నట్లుగా ఉన్న మార్కెట్ లో.. లిమిటెడ్ సీటింగ్ తో కంఫర్ట్ జర్నీ, స్టైటిష్ ఫీచర్లతో మార్కెట్ ను క్యాప్చర్ చేసింది. యూత్ బాగా అట్రాక్ట్ అవ్వడంతో మాస్ మార్కెట్ లో తిరుగులేని కార్ గా.. టాప్ సెల్లర్ గా నిలిచింది 

ట్రెండ్ కు తగ్గట్టుగా మార్చుకుంటూ..

మారుతీ స్విస్ట్ కారు ప్రతి దశలో ట్రెండ్ కు తగ్గట్లుగా మార్చుకుంటూ ముందుకు సాగింది. సాగుతూనే ఉంది. ఇంజిన్ లో మరింత లైటర్ ఇంజిన్ తీసుకొచ్చేందుకు 1.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నుంచి 1.2 లీటర్ పెట్రోల్ అల్యూమినియం ఇంజిన్ గా మార్చుకుంటూ అప్ డేట్ అయ్యింది. అలాగే 2010లో 1.2-K సీరీస్ లీటర్  ఇంజిన్ ను తీసుకొచ్చింది. ఆ తర్వాత సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ కార్ 1.3 లీటర్ డీజిల్ వర్షన్ తీసుకురావడం మరింత సక్సెస్ కు కారణమైంది. ఇక 2018 వచ్చిన 3వ తరం (థర్డ్ జనరేషన్ ) కార్ మరింత లైట్ వెయిట్ తో వచ్చింది. ఇక నాలుగో జనరేషన్ కార్.. 1.2 లీటర్ Z-సీరిస్ మరింత అట్రాక్టివ్ గా.. స్పోర్ట్స్ లుక్ లో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. హైబ్రిడ్ టెక్, లైటర్ ఫ్రేమ్ లో ఫుయెల్ ఎఫిషియెన్సీపై ఫోకస్ పెట్టింది. ఫోర్త్ జెనరేషన్ కార్ లీటర్ కు 25.75 కిలీమీటర్ మైలేజీ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. 

ట్రెండ్ సెట్టర్:

ఇండియాలో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్లు ఎన్ని వచ్చినా.. అది స్విఫ్ట్ కు రుణపడాలేమో. ఎందుకంటే హ్యాచ్ బ్యాక్ మోడల్ ను ప్రవేవ పెట్టింది ఇండియాలో మారుతి స్విఫ్ట్ కారే. ఆ తర్వాత విదేశాల్లో కూడా వివిధ కంపెనీలో హ్యాచ్ బ్యాక్ మోడల్స్ ను తీసుకొచ్చాయి. ఇండియన్ కండిషన్స్ కు అనుకూలంగా ఇంటర్నేషనల్ ఫీచర్స్ తో వచ్చి ట్రెండ్ సెట్ చేసింది స్విఫ్ట్ కారు. ఆ తర్వాత బలెనో, విటారా, బ్రెజా, ఫ్రోన్క్స్.. లాంటి కార్లలో ఈ సిస్టమ్ ను అడాప్ట్ చేసుకున్నారు. చివరికి ప్రీమియం కారైన స్కోడా ఫాబియా కూడా ఇండియాలో అడాప్ట్ చేసుకుందంటే స్విఫ్ట్ ఎంత ట్రెంట్ సెట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 

హై సేల్స్.. హై రీకాల్ వాల్యూ:

సేల్స్ విషయంలో ఇండియాలో స్విఫ్ట్ సేల్స్  టాప్ లో ఉంటుంది. మారుతీ కంపెనీ టోటల్ సేల్స్ లో స్విఫ్ట్ దే 10 శాతం ఉంటుందంటే ఎంత పాపులరో.. ఎంత డిమాండ్ ఉందో చూడండి. మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండటం, హై ఫుయెల్ ఎఫిషియెన్సీ.. అంటే ఎక్కువ మైలేజీ, సర్వీస్ లో నెంబర్ వన్ లాంటి సదుపాయాలు మారుతీ స్విఫ్ట్ ను ఇండియాలో టాప్ లో నిలిపాయి. అందుకే మారుతీ స్విఫ్ట్ ఇప్పటికీ ఇండియా మిడిల్ క్లాస్ కు ఇష్టమైన కారు. 20 ఏళ్లు దాటినా ప్రయాణం అప్డేట్ వెర్షన్స్ తో దూసుకుపోతోంది అంటే అది స్విఫ్ట్ బ్రాండ్ సక్సెస్ ఫార్ములా.