V6 News

కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం : హనుమాండ్ల ఝాన్సీరెడ్డి

కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం : హనుమాండ్ల ఝాన్సీరెడ్డి

తొర్రూరు, వెలుగు : కాంగ్రెస్ తోనే నిరుపేదల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డె కొత్తపల్లిలో సుమారు 200 మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తొర్రూరు పట్టణంలో నిర్వహించిన రుద్రయాగం - చండియాగంలో ఆమె పాల్గొన్నారు.