ఉత్తర ప్రదేశ్ లో 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్

ఉత్తర ప్రదేశ్ లో 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్

ఉత్తరప్రదేశ్ లో మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నారు ఓటర్లు. ఉత్తర ప్రదేశ్ లో ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్ నమోదైంది. వెస్ట్ యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు తొలి దశ పోలింగ్ కొనసాగనుంది. 403 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2 కోట్ల 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎస్పీ మిత్రపక్షం RLD అధినేత జయంత్ చౌధరీ ఓటు వేయరని సమాచారం. ఎన్నికల ర్యాలీ కారణంగా ఓటు వేయడం కాదని పార్టీ నేతలు మీడియాకు తెలిపారు. జయంత్ చౌధరీ ఓటు మథుర ప్రాంతంలో ఉంది. కేంద్రమంత్రి, బీజేపీ నేత ఎస్పీ సింగ్ బఘేల్ ఆగ్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పై కర్హాల్ నుంచి బరిలో నిలిచారు.