మహారాష్ట్రలో ఇంటి నుంచే ఓటేసిన 202 మంది

మహారాష్ట్రలో ఇంటి నుంచే ఓటేసిన 202 మంది

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 202 మంది ఇంటి నుంచే ఓటేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచే క్రమంలో ఎన్నికల సంఘం (ఈసీ) హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా  85 ఏండ్లకు పైబడిన వారు, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. ఈ సందర్భంగా థానే జిల్లాలోని 18 అసెంబ్లీ సీట్లలోముందస్తు ఓటింగ్ జరిగింది.ఈ అవకాశాన్ని 202 మంది సద్వినియోగం చేసుకున్నారని, నవంబర్ 8, 9 తేదీల్లో ఓటేశారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అశోక్ శింగారే తెలిపారు. వీరిలో 85 ఏండ్లకు పైబడిన వారు 166 మంది ఉండగా, దివ్యాంగులు 36 మంది ఉన్నారని చెప్పారు. హోమ్ ఓటింగ్ కోసం థానే జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 933 మంది రిజిస్టర్ చేసుకున్నారని పేర్కొన్నారు.  ఓటింగ్ నవంబర్ 8న ప్రారంభమైందని, నవంబర్ 17 వరకు కొనసాగనుందని వివరించారు.