2020 IPL షెడ్యూల్‌ విడుదల

2020 IPL షెడ్యూల్‌ విడుదల

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (IPL) సీజన్-13 షెడ్యూల్‌ విడుదలైంది. దీనికి సంబంధించి BCCI కార్య‌ద‌ర్శి ‘జై షా’ అధికారిక షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు. మార్చి 29వ తేదీన IPL ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ జ‌రుగుతుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియ‌న్స్ మొదటి మ్యాచ్ ఆడనుంది. మే 24వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ సీజన్‌లో కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే మధ్యాహ్నం జరగనున్నాయి. మొత్తం 57 రోజుల పాటు IPL టోర్నీ ఉంటుంది.