
కోల్ కతా: ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా హిట్టర్ మ్యాక్స్ వెల్ ను మరోసారి దక్కించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా చివరకూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాక్స్ వెల్ ను రూ. 10. 75 కోట్లు పెట్టి సొంత చేసుకుంది.
గత సీజన్లలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్సీ ఆల్ రౌండర్ గా ఆకట్టుకున్నాడు. దీంతో మళ్లీ మ్యాక్సీని ఎలాగైనా సొంత చేసుకుంది పంజాబ్ యాజమాన్యం. లాస్ట్ ఇయర్ ఢిల్లీ టీమ్ లో ఆడిన మ్యాక్సీ బాగా రాణించాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచే హిట్టర్ గా రాణిస్తున్న మ్యాక్స్ వెల్.. సీజన్ సీజన్ కి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 2013 రూ.5.3 కోట్లు పలికిన మ్యాక్సీ..ఈ సీజన్ లో డబుల్ ధమాకా 10.75 రేటు పలికాడు.