న్యూఢిల్లీ: ఇక నుంచి జీడీపీ లెక్కించడానికి 2022–23 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా లెక్కించిన మొదటి అంచనాలు 2026 ఫిబ్రవరి 27న విడుదల కానున్నాయి. కొత్త డేటా సెట్‌లను ఉపయోగించి లెక్కలు వేయనున్నారు.
యాక్టివ్ కంపెనీల వివరాలు, ఎల్‌ఎల్‌పీ ఫైలింగ్స్, కార్పొరేట్ వార్షిక రిటర్న్స్, అలాగే అసంఘటిత సంస్థల వార్షిక సర్వే వంటి డేటాను ఉపయోగిస్తారు. ప్రైవేట్ కార్పొరేషన్లు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్లలో అందుబాటులో లేని డేటాను పూరించడానికి ఈ కొత్త డేటా సెట్‌లు సాయపడతాయని అంచనా. నిపుణులు, అకాడమిక్‌లు, ప్రభుత్వ సంస్థలు వచ్చే నెల 10లోపు ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకటించింది.
