ఐసీసీ టీమ్స్లో మనోళ్లు నలుగురికి ఛాన్స్

ఐసీసీ టీమ్స్లో మనోళ్లు నలుగురికి ఛాన్స్

2022 బెస్ట్ టెస్టు, వన్డే టీమ్స్ను ఐసీసీ ప్రకటించింది.  వన్డే జట్టులో భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా... టెస్టు జట్టుకు కేవలం ఒకే ఒక్క ప్లేయర్ ఎంపికయ్యాడు. వన్డే టీమ్కు బాబర్ అజామ్, టెస్టు టీమ్‌కు బెన్ స్టోక్స్‌ను కెప్టెన్లుగా ఐసీసీ నియమించింది.

ఐసీసీ 2022 బెస్ట్ వన్డే టీమ్లో  శ్రేయస్ అయ్యర్, బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు చోటు దక్కింది. ఈ జట్టులో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఇద్దరు చొప్పున అవకాశం లభించింది. జింబాబ్వే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ దొరికింది. 2022లో వన్డేల్లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లను ఐసీసీ ఎంపిక చేసింది. 

ఐసీసీ 2022 బెస్ట్ టెస్ట్ టీమ్లో భారత్ నుంచి రిషబ్ పంత్కు మాత్రమే చోటు దక్కింది. ఈ జట్టులో ఓపెనర్లుగా ఖవాజా, బ్రాత్‌వైట్‌ స్థానం దక్కించుకున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో లబుషేన్, బాబర్ అజామ్ ఎంపికయ్యారు. వీరితో పాటు బెయిర్ స్టో, స్టోక్స్, రిషభ్ పంత్‌ ఉన్నారు. కమిన్స్, రబాడ, లియోన్, అండర్సన్‌లను బౌలర్లుగా ఎంపిక చేశారు. ఈ జట్టుకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ను  సారథిగా ఐసీసీ అనౌన్స్ చేసింది.

ఐసీసీ 2022 బెస్ట్ వన్డే టీమ్: బాబర్ అజామ్ (కెప్టెన్), ట్రెవిస్ హెడ్, షై హోప్, టామ్ లాథమ్, శ్రేయస్ అయ్యర్, సికిందర్ రజా, మెహదీ హసన్, అల్జారీ జోసెఫ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్.

ఐసీసీ 2022 బెస్ట్ టెస్టు టీమ్: ఉస్మాన్ ఖవాజా, క్రేగ్ బ్రాత్‌వైట్, లబుషేన్, బాబర్ అజామ్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), కమిన్స్, రబాడ, నాథన్ లియోన్, జేమ్స్ అండర్సన్