
న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ సిటీలో న్యూఇయర్ సంబరాలు మొదలయ్యాయి. 2021 బైబై చెప్పేసి... 2022కు వెల్కమ్ చెప్పింది న్యూజీలాండ్. క్రిస్ మస్ ఐలాండ్స్-కిరిబాటీలో ముందుగా న్యూఇయర్ స్టార్ట్ అయింది. తర్వాత న్యూజీలాండ్ ఆధనీంలోని ఛాతమ్ ఐలాండ్స్ న్యూఇయర్ లోకి ప్రవేశించాయి. తర్వాత ఆక్లాండ్ సిటీ న్యూఇయర్ కు వెల్కమ్ చెప్పింది. ఇండియన్ టైమ్ ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆక్లాండ్ కొత్త ఏడాదిని స్వాగతించింది. సెలబ్రేషన్స్ కు సెంటర్ పాయింట్ అయిన ఆక్లాండ్ క్లాక్ టవర్ దగ్గర ఫైర్ క్రాకర్స్ కళ్లు మిరిమిట్లు గొలిపించాయి. ఆక్లాండ్ తర్వాత న్యూజీలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లోనూ న్యూఇయర్ మొదలైంది.
#WATCH New Zealand's Auckland welcomes the new year 2022 with fireworks https://t.co/kNOsxyniQl
— ANI (@ANI) December 31, 2021