
ప్రతీవారం లాగే ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్స్ మాత్రమే కాకుండా..ఓటీటీ(OTT) సంస్థలు కూడా ప్రేక్షకుల కోసం కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అదే విదంగా ఈ వారం కూడా సరికొత్త సినిమాలు ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా ఏ ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో రెండు తెలుగు చిత్రాలు ఉన్నాయి. స్టార్ నటీనటులు ఉన్న ఓ వెబ్ సిరీస్ కూడా రానుంది.
నెట్‌ఫ్లిక్స్
డాటర్స్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 14
వరస్ట్ ఎక్స్ ఎవర్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 14
ఎమిలీ ఇన్ పారిస్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 14
ది యూనియన్ (హాలీవుడ్) ఆగస్టు 16
లవ్ నెక్ట్స్ డోర్ (కొరియన్) ఆగస్టు 17
డిస్నీ+హాట్‌స్టార్
డార్లింగ్ (తెలుగు) ఆగస్టు 13
ది టైరాంట్ (కొరియన్) ఆగస్టు 14
మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ ఆగస్టు 16
తమిళ స్టార్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది.
అమెజాన్ ప్రైమ్
నామ్ నమక్ నిషాన్ (హిందీ) ఆగస్టు 14
జాక్ పాట్ (హాలీవుడ్) ఆగస్టు 15
సోనీలివ్
చమక్ (హిందీ సిరీస్) ఆగస్టు 16
జీ5
మనోరథంగల్ వెబ్ సిరీస్ (యాంథాలజీ ఫిల్మ్) ఆగస్టు 15
ఈ ఆంథాలజీ సిరీస్‍లో సూపర్ స్టార్లు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‍లాల్, ఫాహద్ ఫాజిల్ నటించారు. మరికొందరు స్టార్ యాక్టర్లు కూడా ఉన్నాయి. 9 కథలతో ఈ ఆంథాలజీ సిరీస్ రూపొందింది. 8 మంది డైరెక్టర్లు ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు
జియో సినిమా
శేఖర్ హోమ్ (హిందీ) ఆగస్టు 14
ఈటీవీ విన్
వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు) ఆగస్టు 14
సీనియర్ నటుడు వీకే నరేశ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో పోషించారు. ఫ్యామిలీ రోడ్ ట్రిప్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అనురాగ్ పలుట్ల. వీరాంజనేయులు విహారయాత్ర టీజర్, ట్రైలర్ కామెడీతో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.