కల్కికి స్త్రీ-2 ఎఫెక్ట్!..ప్రభాస్ ఫస్ట్ డే రికార్డును బ్రేక్ చేయనుందా?

కల్కికి స్త్రీ-2 ఎఫెక్ట్!..ప్రభాస్ ఫస్ట్ డే రికార్డును బ్రేక్ చేయనుందా?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి స్పీడుకు బ్రేకులు పడనున్నాయా..? కలెక్షన్లు మందగించనున్నాయా..? అంటే ఔననే అంటున్నారు సినీ పండింతులు. కల్కీ ఏడీ 2898 హిందీలో తొలిరోజే రూ.23 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ –2 హిందీ బెల్ట్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందంటున్నారు.పంద్రాగస్టు రోజు ఈ సినిమా విడుదల కానుంది. 14వతేదీ రాత్రి నుంచే షోలు మొదలవుతాయి.

స్త్రీ పార్ట్ 1 రూ.100 కోట్లు సాధించింది. దీంతో స్త్రీ 2కు తొలి రోజే రూ. 30 కోట్లు వస్తాయనే అంచనాలున్నాయి. అంతేకాకుండా స్ట్రీ 2' అడ్వాన్స్ బుకింగ్ లో మొదటి రోజున 'కల్కి' మరియు 'ఫైటర్'ని అధిగమించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన కామెడీ హారర్ చిత్రం 'స్త్రీ 2' (Stree 2). ఒకవైపు భయపెడుతూ.. మరోవైపు నవ్వుల్లో ముంచెత్తే విధంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని.

2018లో వచ్చిన 'స్త్రీ' మూవీకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో 'ఆజ్ కీ రాత్' అనే ప్రత్యేక పాటతో తమన్నా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ అభిమానుల్ని అలరించనున్నారు. జియో స్టూడియోస్, మ్యాడోక్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపర్ శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలు పోషించారు.