Ram Charan: చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్..విజయం సాధించినందుకు అభినందనలు

Ram Charan: చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్..విజయం సాధించినందుకు అభినందనలు

మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు(CommitteeKurrollu). ఆగస్ట్ 9న ఈ క‌మిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించిన క‌మిటీ కుర్రోళ్ల జాతరకు సినీ ఆడియన్స్ తో పాటుగా సినిమా స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే నిహారికకు కంగ్రాట్స్ చెబుతూ..త్వరలో సినిమా చూస్తానని సూపర్ స్టార్ మహేష్ బాబు పోస్ట్  చేశారు.

తాజాగా " 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో నిహారిక ఘనవిజయం సాధించినందుకు అభినందనలు! ఈ సినిమా విజయానికి అర్హత పొందదగినది.  !! మీ చిత్ర బృందం ఈ సినిమా కోసం చేసిన కృషి మరియు అంకితభావం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన మొత్తం నటీనటులు మరియు సిబ్బందికి అభినందనలు మరియు దర్శకుడి మేకింగ్ కి కుదాస్.." అంటూ చరణ్ ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్, చరణ్ వంటి స్టార్ హీరోస్ స్పందించినందుకు సినీ సర్కిల్ లో  పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

క‌లెక్ష‌న్స్‌

ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ.1.63 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. రెండవ రోజు రూ.3.69 కోట్లను రాబ‌ట్టింది.ఇక ఈ సినిమాకు వచ్చే మౌత్ టాక్ రోజురోజు పెరుగుతుండటంతో కలెక్షన్స్ పెరుగుతూ వెళుతున్నాయి. దీంతో విడుదలైన మొదటి మూడు రోజుల్లో క‌మిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ దగ్గర రూ. 6.04 కోట్ల‌ కలెక్షన్స్ రాబ‌ట్టింది.ఇక ఆగస్ట్ 15వరకు ఎలాంటి సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం (ఆగస్ట్ 12) డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి నాలుగు రోజులకు గాను మొత్తంగా రూ.7.48 కోట్లు థియేటర్ల నుండి సాధించి..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లిట్ చేసుకుంది. దింతో ఆ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ మేకర్స్ అధికారక పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఈ సినిమా అచ్చ‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి క‌థ‌. అంటే మన కథ. ప‌ల్లెటూళ్ల‌లో క‌ల్మ‌షం లేని మ‌నుషులు, వారి స్నేహాలు..అక్క‌డి రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న‌ది డైరెక్టర్ య‌దు వంశీ చాలా సహజ సిద్ధంగా చూపించారు.