
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం పుష్ప–2 ది రూల్. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు వేగంగా సాగుతోంది. ఈ మూవీ షెడ్యూల్ ఎండింగ్ లో ఓ సాంగ్ ను మాట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్,రష్మిక కాంబినేషన్లో ఈ రొమాంటిక్ సాంగ్ సాగనుంది. ఇందుకోసం ఆడవి నేపథ్యంలో ఓ భారీ సెట్ ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అద్భుత విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్ 'కి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ "పుష్ప2' కోసం ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అద్భుత విజయం సాధించాయి. అటు యూట్యూబ్ లోనూ మంచి బజ్ క్రియేట్ చేశాయి.
డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్..మైత్రీ మూవీమేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.