ఇక టిఫిన్ పే చ‌ర్చ .. బీజేపీ స‌రికొత్త ప్ర‌చార నినాదం

ఇక టిఫిన్ పే చ‌ర్చ .. బీజేపీ స‌రికొత్త ప్ర‌చార నినాదం

ఇన్నాళ్ల చాయ్ పే చర్చా ద్వారా ప్రజలకు దగ్గరైన బీజేపీ..ఇక నుంచి టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మే 30వ తేదీ నుంచి టిఫిన్ పే చర్చా కార్యక్రమాన్ని ప్రాంభించింది. 

టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా కార్యకర్తలను ఐక్యంగా ఉంచడం, కార్యకర్తల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం  చేస్తుంది. తమ ఇండ్లలో చేసిన టిఫిన్ లను ప్యాక్ చేసుకుని...అందరూ ఒకే చోట తింటారు. ఈ కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగనుంది. 

టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన లీడర్లు పాల్గొని..ప్రజలకు మరింత చేరువ అవడానికి తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యచరణ గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇస్తారు. యూపీలోని మొత్తం 1918 ప్రాంతాల్లో టిఫిన్ పే చర్చా సమావేశాలు జరుగనున్నాయి. 

2024 ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టాలంటే ఉత్తర్ ప్రదేశ్లోని లోక్సభ సీట్లు కీలకం కానున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఉత్తరప్రదేశ్ లోని ఎంపీ సీట్లలో గెలవడమే. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడ ఎక్కువ సీట్లలో గెలిస్తే ఈజీగా ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టవచ్చని బీజేపీ ప్లాన్. ఇందులో భాగంగానే టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.