Theatre Movies: సినీ లవర్స్కు పండగే.. ఈ వారం (జూన్ 2-8) థియేటర్‌లో 6 సినిమాలు.. థ్రిల్లర్ జోనర్స్లో

Theatre Movies: సినీ లవర్స్కు పండగే.. ఈ వారం (జూన్ 2-8) థియేటర్‌లో 6 సినిమాలు.. థ్రిల్లర్ జోనర్స్లో

ఈ వారం (జూన్ 2 నుంచి జూన్‌ 8) వరకు థియేటర్‌ లో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జూన్ నెలలో భారీ బడ్జెట్ మూవీస్ తో పాటు చిన్న సినిమాలు సైతం రిలీజ్ కానున్నాయి. దాంతో జూన్ మొత్తం సినిమాల జాతరతో థియేటర్ మోత మోగనుంది. మరి జూన్ లో రిలీజ్కు సిద్దమవుతున్న ఆ సినిమాలేంటీ? అందులోనూ జూన్‌ ఫస్ట్ వీక్లో థియేటర్ రానున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి.. 

థ‌గ్‌లైఫ్:

విశ్వనటుడు కమల్ హాసన్-దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ థ‌గ్‌లైఫ్ (Thug Life). 1987లో వచ్చిన సూపర్ హిట్ మూవీ నాయకుడు తర్వాత వీరి కలయికలో థ‌గ్‌లైఫ్ తెరకెక్కింది. తనదైన క్లాస్ టచ్‌‌‌‌తో కంప్లీట్‌‌‌‌ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు మణిరత్నం.

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ శింబు కీలక పాత్ర పోషించగా త్రిష, అభిరామి హీరోయిన్స్‌‌‌‌ గా నటించారు. ఈ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఓ నాయకుడు, అతను పెంచుకునే వారసుడు.. ప్రత్యర్థులు ఆ పవర్‌‌‌‌ను లాక్కోవడానికి చేసే ప్రయత్నాలే థ‌గ్‌లైఫ్!

‘గ్యాంబ్లర్స్‌‌’:

‘మ్యాడ్‌‌ స్క్వేర్‌‌’తో సూపర్ హిట్ అందుకున్న సంగీత్ శోభన్‌‌ ‘గ్యాంబ్లర్స్‌‌’అనే ఓ మిస్ట‌రీ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంగీత్ శోభన్‌కు జోడిగా ప్రశాంతి చారులింగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఈమూవీ జూన్ 6న విడుదల కాబోతోంది. సునీత, రాజ్‌‌కుమార్‌‌ బృందావనం నిర్మాతలు. గ‌తంలో రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్రీవ‌ల్లి సినిమాకు సునీత‌, రాజ్‌కుమార్ ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు.

ఇకపోతే ఈ సినిమాలో పేకాటలో ఆరితేరిన వ్యక్తి పాత్రలో సంగీత్ నటించాడు. అతను పేకాటలో వేసే ఎత్తులు, అతన్ని వెంటాడానికి వచ్చే ఓ 5 గురు మిస్టరీయస్ వ్యక్తులు, మధ్యలో డైమండ్ కోసం ఒకరికొకరు ఎలా తలపడ్డారు? ఎవరు ఎవర్ని మోసం చేశారు అనేది మిగతా స్టోరీ!

‘శ్రీశ్రీశ్రీ రాజావారు’:

మ్యాడ్, ఆయ్, మ్యాడ్‌‌ స్క్వేర్‌‌ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న నార్నే నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద హీరోయిన్. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మించారు.

లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్ లో తెరకెక్కింది. ఈ మూవీ జూన్‌ 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇకపోతే ఈ మూవీ మ్యాడ్, ఆయ్, మ్యాడ్‌‌ స్క్వేర్‌‌ సినిమాల కంటే ముందే షూటింగ్ జరుపుకున్నట్లు సమాచారం. పలుమార్లు విడుదలకు నోచుకోక వాయిదా పడుతూ వచ్చింది.

బద్మాషులు:

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌‌లో శంకర్ చేగూరి తెరకెక్కించిన మూవీ ‘బద్మాషులు’. తార స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌‌‌‌పై బి. బాలకృష్ణ, సి.రామ శంకర్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ఈ కుటుంబ కథా చిత్రం జూన్ 6న దీపా ఆర్ట్స్ ద్వారా ఈ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

పాడేరు 12వ మైలు:

సత్యం రాజేష్ లీడ్‌‌ రోల్‌‌లో రూపొందిన చిత్రం ‘పాడేరు 12వ మైలు’.సుహాన హీరోయిన్‌‌గా నటించగా శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఎన్.కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ నిర్మించారు. జూన్ 6న సినిమా విడుదల కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కింది. 

‘హౌస్‌‌‌‌‌‌‌‌ఫుల్ 5’:

హౌస్‌‌‌‌‌‌‌‌ఫుల్ ఫ్రాంచైజీ ఏ రేంజ్‌‌‌‌‌‌‌‌లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. స్టార్ కాస్ట్‌‌‌‌‌‌‌‌తో భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఇప్పటికే నాలుగు పార్ట్స్ నిర్మించాడు సాజిద్ నడియాడ్‌‌‌‌‌‌‌‌వాలా. సక్సెస్ ఫుల్ కామెడీ మూవీ సీరీస్ గా తెరకెక్కిన లేటెస్ట్ హౌస్ ఫుల్ సీజన్ 5 జూన్ 6న రిలీజ్ కాబోతోంది.

తరుణ్ మన్సుఖానీ డైరెక్ట్ చేసిన హౌస్ ఫుల్ 5 కామెడీ, థ్రిల్లింగ్, సస్పెన్స్, మిస్టరీతో తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్, జాన్ అబ్రహామ్, బాబీ డియోల్ పెద్ద స్టార్ క్యాస్టే నటిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫిమేల్ లీడ్స్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నారు.