అయ్యో రామా.. రోహిత్, కోహ్లీలకి గాయాలు.. వరల్డ్ కప్ ప్లాన్స్‌పై గంభీర్‌కు కునుకు లేకుండా చేశాయ్!

అయ్యో రామా.. రోహిత్, కోహ్లీలకి గాయాలు.. వరల్డ్ కప్ ప్లాన్స్‌పై గంభీర్‌కు కునుకు లేకుండా చేశాయ్!

2027 World Cup in Danger: టీమిండియా ఫ్యాన్స్‌ని ఇప్పుడు ఒకే ఒక ఫీలింగ్ వెంటాడుతోంది.. అదే ఇంజ్యూరీ టెన్షన్.. ఒకవైపు విరాట్ కోహ్లీ ఆల్రెడీ అఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్ నుంచి అఫీషియల్‌గా రూల్డ్ అవుట్ అవ్వగా.. మరోవైపు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా అదే గాయంతో సిరీస్ ఆడటం డౌట్‌గా మారింది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటమే టార్గెట్‌గా పెట్టుకున్న ఈ ఇద్దరు డే లెజెండ్స్‌కి ఇప్పుడు ఫామ్ కంటే ఫిట్‌నెస్ కీలకంగా మారింది.  

ఐపీఎల్ 2026 ఎఫెక్ట్: 
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచులు విపరీతమైన ఎండలు, ఉక్కపోత మధ్య జరిగాయి. దీంతో ప్లేయర్స్ బాడీస్‌పై విపరీతమైన ప్రెజర్ పడింది.

* విరాట్ కోహ్లీ: ఆర్‌సీబీ తరఫున మొత్తం 16 మ్యాచులు ఆడిన విరాట్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో గాయంతోనే ఆర్సీబీకి కప్ అందించాడు. కానీ ఆ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ వల్లే ఇప్పుడు అఫ్గాన్ సిరీస్‌కి దూరమయ్యాడు. ప్రజెంట్ కోహ్లీ రికవరీ కోసం యూరప్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు.

* రోహిత్ శర్మ: ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ కూడా హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో కొన్ని మ్యాచులకు దూరమై మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు. కానీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో బెంగళూరులోని CoE టెస్టులు పాస్ అయితేనే అఫ్గాన్ తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. 

హిట్‌మ్యాన్ హ్యామ్‌స్ట్రింగ్: 
రోహిత్ శర్మకి ఈ హ్యామ్‌స్ట్రింగ్ సమస్య ఈరోజుది కాదు.. కెరీర్‌లో చాలా సార్లు దీన్ని ఫేస్ చేశాడు. 
* 2019: ఐపీఎల్‌లో ఇంజ్యూరీ అయి వరల్డ్ కప్ మిస్ అవుతారనుకున్నా త్వరగానే రికవర్ అయ్యారు.
* 20–2022: యూఏఈ ఐపీఎల్‌లో అయిన లెఫ్ట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఆస్ట్రేలియా టూర్, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్ కూడా మిస్ అయ్యారు. అప్పట్లో రోహిత్ ఫిట్‌నెస్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.
* 2025: మొన్నటి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఇంజ్యూరీ అయినా, బ్యాటింగ్‌కి వచ్చి 20 రన్స్ కొట్టారు.

2027 వరల్డ్ కప్‌కి సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్:  
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ ముందర ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరి ఫామ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నా.. ఈ ఇద్దరు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి ఇంజ్యూరీ ప్లేయర్లను మోసుకెళ్లడం ఇంపాజిబుల్. అందుకే వీరిద్దరికీ బ్యాకప్‌గా రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్ రేసులోకి వచ్చారు.  

ALSO READ : భారత్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్ సిరీస్‌ నుంచి కోహ్లీ తర్వాత రోహిత్ ఔట్?

గైక్వాడ్, పడిక్కల్, జైస్వాల్ కంటే ముందు 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఐపీఎల్ 2026 లో ఊచకోత కోసి సీనియర్ టీమ్ లో డెబ్యూకి రెడీగా ఉన్నాడు. ఒకవేళ అతను సీనియర్ లెవెల్‌లో సక్సెస్ అయితే.. 2027 వరల్డ్ కప్ రేసులోకి దూసుకొచ్చి రోహిత్, విరాట్‌ల స్థానాలకే గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ 2027 ప్రపంచ కప్ ఆడాలా లేదా అనేది వాళ్ల ఫిట్‌నెస్‌ పై ఆధారపడి ఉంది.