ఫస్ట్ విడత సర్పంచ్కి ..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2,107 నామినేషన్లు

ఫస్ట్ విడత సర్పంచ్కి ..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2,107 నామినేషన్లు

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు:  నిజామాబాద్​జిల్లాలో ఫస్ట్​ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు జరిగే బోధన్​ డివిజన్​లో సర్పంచ్ స్థానాలకు మొత్తం 1,156 నామినేషన్ లు దాఖలయ్యాయి. వార్డుల్లో పోటీ చేయడానికి 3,526 మంది నామినేషన్​లు వేశారు. మొత్తం11 మండలాల పరిధిలోని 184 జీపీలు, 1,642 వార్డులకు మొదటి విడతలో ఎలక్షన్​ జరుగనుంది. శనివారం అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించిన ఆర్వోలు ఆదివారం రాత్రి వరకు లెక్కలు వేసి వాటి సంఖ్య తేల్చారు.

దాని ప్రకారం నవీపేట మండలంలో సర్పంచ్​ పోస్టులకు అత్యధికంగా 182 , వార్డులకు 639 నామినేషన్లు దాఖలయ్యాయి. పోతంగల్ మండలంలో సర్పంచ్​ స్థానాలకు 156, వార్డులకు 333 నామినేషన్​లు అందాయి. బోధన్​ మండలంలో సర్పంచ్​ పదవికి 132, వార్డు సభ్యులుగా 421 నామినేషన్​లు వేశారు. చందూర్​ మండలంలో సర్పంచ్​ స్థానాలకు 54, వార్డులకు 119 నామినేషన్​లు వచ్చాయి. మోస్రా మండలంలో సర్పంచ్​ కుర్చీకి 35, వార్డులకు 141, రెంజల్​ మండలంలో సర్పంచ్​ స్థానాలకు 112, వార్డుల నుంచి 361 నామినేషన్​లు ఆర్వోలకు అందాయి.

రుద్రూర్​ మండలంలో సర్పంచ్​ స్థానాలకు 86, వార్డులకు 245, సాలూరా మండలంలో సర్పంచ్​లుగా 68, వార్డులకు 246 నామినేషన్​లు పోటీదారులు వేశారు. వర్ని మండలంలో సర్పంచ్​లుగా 114, వార్డులకు 373 నామినేషన్​లు అందాయి. ఎడపల్లి మండలంలో సర్పంచ్​ పదవికి 112, వార్డు స్థానాలకు 387 నామినేషన్​లు దాఖలయ్యాయి. ఇందులో కొందరు డబుల్​ నామినేషన్​​లు వేసిన వారున్నారు. ఆదివారం నామినేషన్​ల స్కృట్నీ నిర్వహించారు. సోమవారం అర్హతగల నామినేషన్​ల లిస్టు ప్రకటిస్తారు. 3న విత్​డ్రా ఉండడంతో బరిలో ఉన్న కొందరు తమ ఎన్నిక ఏకగ్రీవం చేసుకోడానికి బేరసారాలు చేస్తున్నారు.

ఆరు వార్డుల్లో జీరో నామినేషన్స్​

ఫస్ట్​ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్​ జరిగే 11 మండలాల్లో ఆరు వార్డుల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కలెక్టర్ కన్ఫర్మేషన్ తరువాత డీపీఆర్వో ఆ వివరాలు మీడియాకు రిలీజ్ చేసింది. నవీపేట మండలం మట్టయ్యఫారం జీపీ పరిధిలోని 8వ వార్డు, పోతంగల్​ జీపీ పరిధిలోని 11వ వార్డు, జల్లేపల్లి 10వ వార్డు, రెంజల్ మండలంలోని నీలాపేపర్ మిల్లు 4వ వార్డుకు జీరో నామినేషన్​ నమోదైంది. ఎడపల్లి మండలం అంబం (వై) జీపీలోని 3వ వార్డు, సాలూరా మండలం తగ్గెల్లి పంచాయతీలోని 1వ వార్డుకు ఎవరూ నామినేషన్​ వేయలేదని తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో నామినేషన్లు

ఫస్ట్ విడతలో ఎన్నికలు జరిగే పంచాయల్లో నామినేషన్ల పరిశీలన పక్రియ ఆదివారం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని 10 డివిజన్లలోని 167 పంచాయతీలు,  1,520 వార్డులకు వచ్చిన నామినేషన్లను పరిశీలన జరిగింది. సరిగ్గా ఉన్న అభ్యర్థుల నామినేషన్లతో పాటు,  ఒక్కో అభ్యర్థి రెండు, మూడు సెట్ల నామినేషన్లు వేసిన ఒక సెట్​ను పరిగణలోకి తీసుకున్నారు. సర్పంచ్​కు  951 మంది, వార్డు మెంబర్లకు 3,7‌‌‌‌‌‌‌‌09 మంది అభ్యర్థులు ఉన్నారు.  

ఈ నెల 3 న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్​డ్రాకు అవకాశం ఉంది. 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు, గుర్తులను ప్రకటిస్తారు. భిక్కనూరు మండలంలోని 18 గ్రామాలకుగాను సర్పంచ్​కి 110, వార్డు మెంబర్లకు 530, బీబీపేట  మండలంలోని 11  గ్రామాలకుగాను సర్పంచ్​కి 60, వార్డు మెంబర్లకు 272,  దోమకొండ మండలంలోని  9  గ్రామాలకుగాను సర్పంచ్​కి 57,  వార్డు మెంబర్లకు 279, కామారెడ్డి మండలంలోని 14  గ్రామాలకుగాను సర్పంచ్​కి 86,  వార్డు మెంబర్లకు 335, మాచారెడ్డి మండలంలోని 25  గ్రామాలకుగాను సర్పంచ్​కి 163, వార్డు మెంబర్లకు 425, పాల్వంచ మండలంలోని 12  గ్రామాలకుగాను సర్పంచ్​కి 71,  వార్డు మెంబర్లకు 294, రాజంపేట మండలంలోని 18  గ్రామాలకుగాను సర్పంచ్​కి 105, వార్డు మెంబర్లకు 355, రామారెడ్డి మండలంలోని 18  గ్రామాలకుగాను సర్పంచ్​కి 103, వార్డు మెంబర్లకు 422, సదాశివనగర్​ మండలంలోని 24  గ్రామాలకుగాను సర్పంచ్​కి 111, వార్డు మెంబర్లకు 452,  తాడ్వాయిమండలంలోని 18  గ్రామాలకుగాను సర్పంచ్​కి 85, వార్డు మెంబర్లకు 345 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.