
ధోనీ ధనాధన్ బ్యాటింగ్ తో దడపుట్టిస్తున్నాడు. తాహిర్, హర్భజన్ తమ స్పిన్ తో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. డ్వేన్ బ్రావో, సురేశ్ రైనా, డుప్లెసిస్ మెరుస్తూనే ఉన్నారు. కానీ, చెన్నై జట్టులో సీజన్ లో ఇప్పటిదాకా తన మార్కు చూపెట్టని వృద్ధ సింహం షేన్ వాట్సన్ ఒక్కడే. బౌలింగ్ కు పూర్తిగా దూరంగా ఉన్నా బ్యాట్‌తో సత్తా చాటలేకపోతున్న వాట్సన్ ఒక్కసారి షేర్‌లా చెలరేగాడు.తన కసినంతా సన్ రైజర్స్ బౌలర్లపై చూపించాడు. తుఫాను ముందు ప్రశాంతతలా ఏడో బాల్‌కు గానీ ఖాతా తెరవలేకపోయిన ఆసీస్ వీరుడు.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కొద్దిలో సెంచరీ కోల్పోయినా.. అద్భుత ఇన్నింగ్స్ తో చెన్నైని గెలిపించాడు.
వెటరన్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ (53బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 96) సీజన్ లోతొలిసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో చెన్నైమళ్లీ టాప్ ప్లేస్ కు చేరుకొని ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. హైదరాబాద్ లో సన్ రైజర్స్ చేతిలో ఎదురైన పరాభవానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ను ఓడించింది. మనీశ్ పాండే(49 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 83 నాటౌట్ ) మెరుపు బ్యాటింగ్ ,వార్నర్ ( 45 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లతో 57) హాఫ్ సెంచరీతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రై జర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్భజన్ సింగ్ (2/39) రెండు వికెట్లు తీశాడు. అనంతరం వాట్సన్ మెరుపు బ్యాటింగ్ తో చెన్నై 19.5 నాలుగువికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి విజయంసాధించింది. సురేశ్ రైనా(38) కూడా రాణించా డు.
వాట్సన్ వండర్..
ఖాతా తెరవడానికి 11 బంతులు తీసుకున్న చెన్నైఓపెనింగ్ జోడీ జట్టు స్కోరు మూడు పరుగులకు చేరేసరికే విడిపోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో డుప్లెసిస్ (1)ను రనౌట్ చేసిన హుడా చెన్నై శిబిరంలో ఆందోళన రేపాడు. తొలి రన్ కు ఏడు బంతులు తీసుకున్న వాట్సన్ .. ఖలీల్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్ లో 6,4 కొట్టి టచ్ లోకి వచ్చాడు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే బౌండరీ కొట్టిన సురేశ్ రైనా.. సందీప్ శర్మ వేసిన ఆరోఓవర్ లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో రెచ్చి పోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి చెన్నై 49/1పైనిలిచింది. ఆ తర్వాత మళ్లీ స్కోరు వేగం తగ్గింది. ఈక్రమంలో సందీప్ వేసిన తొమ్మిదో ఓవర్ లో వాట్సన్ ఇచ్చిన క్లిష్టమై న క్యాచ్ ను బెయిర్ స్టో అందుకోలేకపోవడంతో షేన్ బతికిపోయాడు. అయితే పదో ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బౌలింగ్ లో రైనా స్టంపౌట్ అవ్వడంతో చెన్నై స్పీడ్ కు మరోసారి బ్రేక్ పడింది. వాట్సన్, రైనా రెండో వికెట్ కు 45 బంతుల్లో 77 రన్స్ జోడించారు. ఆ తర్వాత రాయుడుతో కలిసి వాట్సన్ జట్టును నడిపించాడు. సందీప్ వేసిన 12వ ఓవర్ లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన వాట్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు జట్టు స్కోరును సెంచరీ దాటించాడు. విజయానికి 30 బంతుల్లో 41 రన్స్ అవసరమైన టైమ్ లో రషీద్ వేసిన 16వ ఓవర్ లో వాట్సన్ 6,4 కొట్టి మ్యాచ్ ను తమవైపు లాగేసుకున్నాడు. అయితే, సెంచరీకి చేరువైన వాట్సన్ ను ఔట్‌చేసిన భువీ 18వ ఓవర్లో మూడు రన్సే ఇచ్చి మ్యాచ్ లో కొంచెం ఉత్కంఠ నింపాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడిన కేదార్ (11నాటౌట్ ) చెన్నైని గెలిపించాడు.
స్టో ఫ్లాప్ .. మనీశ్ హిట్
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్‌కు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ రెండో ఓవర్లోనే పెద్ద షాకిచ్చాడు. భీకర ఫామ్ లో ఉన్న ఓపెనర్ జానీ బెయిర్ స్టో (0)ను ఔట్ చేసి రైజర్స్ శిబిరంలో ఆందోళన రేపాడు. భజ్జీవేసిన బంతిని కట్ చేయబోయిన జానీ.. వికెట్ కీపర్‌ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన మనీశ్ పాండేతో కలిసి వార్నర్ ధాటిగా ఆడడంతో స్కో రు బోర్డు పరుగులు పెట్టింది. భజ్జీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో తలో సిక్సర్ కొట్టిన ఈ ఇద్దరు…చహర్ వేసిన తర్వాతి ఓవర్లో చెరో బౌండ్రీ రాబట్టారు. భజ్జీ వేసిన ఆరో ఓవర్ లో మనీశ్ మరో రెండు ఫోర్లుకొట్టడంతో పవర్ ప్లే ముగిసే సరికి రైజర్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఆదేజోరును కొనసాగిం చిన వార్నర్ , మనీశ్ వెంటవెంటనే హాఫ్ సెం చరీలు పూర్తి చేసుకున్నారు. అయితే, 14వఓవర్లో టర్నింగ్ బాల్‌తో వార్నర్ ను స్టంపౌట్ చేసిన భజ్జీ రెండో వికెట్ కు 115 పరుగులు భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత రైజర్స్ స్కోరు వేగం తగ్గింది.తాహిర్, బ్రావో, చహర్ ఒత్తిడి పెంచడంతో విజయ్‌శంకర్ (26), పాండే షాట్లు ఆడలేకపోయారు.. చహర్ వేసిన 19వ ఓవర్లో భారీషాట్ ఆడిన శంకర్‌డీప్ మిడ్ వికెట్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. చివరి ఓవర్లో బ్రావో ఎనిమిది పరుగులే ఇచ్చి సన్ రైజర్స్‌ను కట్టడి చేశాడు.
స్కోర్‌బోర్డు
సన్ రైజర్స్ : వార్నర్ (స్టంప్ డ్ ) ధోనీ (బి) హర్బజన్ 57, బెయిర్ స్టో (సి)ధోనీ (బి) హర్బజన్ 0, మనీశ్ పాండే
(నాటౌట్ ) 83, విజయ్ శంకర్ (సి) జడేజా (బి) చహర్ 26, యూసుఫ్ (నాటౌట్ ) 5 ; ఎక్స్ ట్రాలు : 5 ;
మొత్తం: 20 ఓవర్లలో 175/3 ; వికెట్ల పతనం : 1–5, 2–120, 3–167 ; బౌలిం గ్ : చహర్ 4–0–30–1,
హర్బజన్ 4–0–39–2, జడేజా 4–0–33–0, బ్రావో 4–0– 35–0, తాహిర్ 4–0–38–0.
చెన్నై సూపర్‌కింగ్స్ : వాట్సన్ (సి) బెయిర్ స్టో (బి) భువనేశ్వర్ 96, డుప్లెసిస్ (రనౌట్ ) 1, రైనా(స్టంప్ డ్ )
బెయిర్ స్టో (బి) రషీద్ 38, రాయుడు (సి) శంకర్ (బి) సందీప్ 21, కేదార్ (నాటౌట్ )11 , బ్రావో (నాటౌట్ )
0; ఎక్స్ ట్రాలు: 9; మొత్తం : 19.5 ఓవర్లలో 176/4, వికెట్ల పతనం: 1–3, 2–80, 3-–160, 4–175,.
బౌలిం గ్ : భువనేశ్వర్ 4–1–18–1 , ఖలీల్ 4–0–26–0, షకీబ్ 4–0–27–0, సందీప్ 3.5–0–54–1,
రషీద్ 4–0–44–1.