స్వాతంత్రదినోత్సవం రోజున అరుదైన వీడియో.. నెటిజన్ల ప్రశంసలు, సోషల్ మీడియా వైరల్..

స్వాతంత్రదినోత్సవం రోజున అరుదైన వీడియో.. నెటిజన్ల ప్రశంసలు, సోషల్ మీడియా వైరల్..

ఇవాళ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో తీసిన ఒక అరుదైన వన్యప్రాణుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఓ ప్రకృతి శాస్త్రవేత్త షేర్ చేసిన ఈ వీడియోలో భారతదేశ జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి ఒకే చోట పక్కపక్కనే నడుస్తుండటం కనిపిస్తుంది. 

ఈ వీడియోలో ముందు నెమలి వెనుక పులి నిశ్శబ్దంగా నడుస్తుండటం చూడొచ్చు, దీనిని చూసిన చాలా మంది వన్యప్రాణుల ప్రేమికులు ఇలా చాల అరుదుగా, జీతంలో ఒక్కసారే నేరుగా చూసే అదృష్టం కలుగుతుందని అంటున్నారు. 

సరైన ప్రదేశం, సరైన సమయంలో ప్రత్యేకమైన దృశ్యం. అవి మన దేశానికి గర్వకారణం. వాటిని కాపాడటం మన బాధ్యత అంటూ వీడియోతో పోస్ట్ చేసారు.  

ఈ పోస్ట్ ప్రకృతి ప్రేమికుల నుండి ఎన్నో ప్రశంసలు పొందింది. ఇది భారతదేశ గొప్ప జీవవైవిధ్యం(biodiversity), దానిని కాపాడుకోవలసిన బాధ్యతను  గుర్తుచేస్తుందని నెటిజన్లు అంటున్నారు.