
నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల చెక్ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో చెక్కును అందజేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో పాడిన నాటు నాటు పాట ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్ కు 2023లో ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్.. అధికారంలోకి వచ్చిన వెంటనే కోటి రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆ సందర్భంగా రూ.10 లక్షల చెక్కును ఇచ్చి సన్మానించారు. ఆ తర్వాత గద్దర్ అవార్డుల వేడుకల్లో కూడా త్వరలో కోటి రూపాయల చెక్కును సిప్లిగంజ్ కు అందజేస్తామని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం (ఆగస్టు 15) గోల్కొండ కోటలో రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల చెక్కును అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.
►ALSO READ | నాది మధ్య తరగతి మనస్తత్వం.. ప్రజల సంపద కొల్లగొట్టే వ్యక్తిని కాదు: సీఎం రేవంత్