
SBI Loans to Agniveers: భారత ప్రభుత్వం 2022 జూన్‌లో త్రివిధ దళాల్లో పనిచేసేందుకు అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో యువత భారత రక్షణ సేవల్లో 4 ఏళ్లు పనిచేసేందుకు వీలు కల్పించబడింది. ఆధునిక టెక్నాలజీతో యుద్ధ భూమిపై దేశరక్షణ కోసం వీరు పనిచేసేందుకు వీలుగా ఆర్మీ శిక్షణను పొందుతారు అగ్నివీర్స్. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా వీరి సేవలు పాకిస్థాన్ దుశ్చర్యలను అడ్డుకోవటానికి దోహదపడ్డాయని రక్షణ వర్గాలు చెప్పాయి.
అయితే తాజాగా.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అగ్నివీర్లకు ప్రత్యేక పర్సనల్ లోన్ స్కీమ్ ప్రారంభించింది. స్టేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న అగ్నివీర్‌లు ఎలాంటి కలేటరల్ లేకుండానే.. సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో రూ.4 లక్షల వరకు రుణాలను పొందవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది. తిరిగి చెల్లించే కాలపరిమితి అగ్నిపథ్ స్కీమ్ కాలపరిమితికి అనుగుణంగా ఉంటుందని చెప్పింది. అలాగే సెప్టెంబర్ 30, 2025 వరకు రక్షణ సిబ్బందికి కేవలం 10.50% వడ్డీ రేటును లోన్స్ అందిస్తున్నట్లు చెప్పింది ఎస్బీఐ.
ALSO READ : భారతీయులు బరువు తగ్గాల్సిందే..
స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశానికి అంకితభావం , ధైర్యంతో సేవ చేస్తున్న యువ అగ్నివీర్స్ కోసం కొత్త స్కీమ్ తీసుకురావటం సంతోషంగా ఉందని ఎస్బీఐ చైర్మన్ సిఎస్ సెట్టి చెప్పారు. ఇలాంటి మరిన్ని స్కీమ్స్ భారత సాయుధ దళాల్లో పనిచేసే ధైర్యవంతుల కోసం తాము తీసుకొస్తూనే ఉంటామి ఆయన చెప్పారు.