భారతీయులు బరువు తగ్గాల్సిందే.. మోడీ ఎర్రకోట ప్రసంగంలో ఆరోగ్య హెచ్చరిక..!

భారతీయులు బరువు తగ్గాల్సిందే.. మోడీ ఎర్రకోట ప్రసంగంలో ఆరోగ్య హెచ్చరిక..!

Modi On Cooking Oil: ప్రధాని మోడీ దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆర్థిక వ్యవస్థ పురోగతితో పాటు ప్రజల ఆరోగ్యం గురించి కూడా కీలక ప్రసంగం చేశారు ఎక్రకోట నుంచి. భారతదేశంలో ప్రస్తుతం పెరిగిపోతున్న ఊబకాయ సమస్య గురించి ప్రధాని ప్రస్థావించారు. ఇది భారతదేశానికి పెద్ద ప్రమాదం అన్న మోడీ ఆరోగ్యంపై ఫోకస్ పెంచాలని అలాగే వంటనూనె వినియోగాన్ని ప్రతి కుంటుంబం 10 శాతం తగ్గించాలని చెప్పారు. 

నూనె వాడకం తగ్గించటం కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ముఖ్యమని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో ఇండియా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోకుండా ఉండేందుకు భారతీయులు బరువు తగ్గటం ముఖ్యమన్నారు. ఇప్పటికే దేశంలో 10 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని.. 25 శాతం మంది యువత ఊబకాయులుగా ఉండటం ఆరోగ్య సమస్యలకు దారితీసి ఆర్థికంగానూ కుటుంబాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు మోడీ.

ఇప్పటికే 2023-24 ఆర్థిక సర్వే దేశంలో పెరుగుతున్న ఊబకాయుల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసింది. అనారోగ్యంగా ఉన్న యువత దేశ పురోగతిలో భాగం కాలేదని.. ఊబకాయం పెద్ద సమస్యగా మారటానికి ముందే అప్రమత్తం కావాలని రిపోర్ట్ చెప్పింది. ఆరోగ్య నిపుణులు కూడా చాలా కాలం నుంచి ప్రజల్లో పెరుగుతున్న రిఫైన్డ్ వంట నూనెల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో మన పూర్వీకులు ఫాలో అయిన వంట విధానాలకు భారతీయులు తిరిగి మారాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగం ద్వారా యువతకు గుర్తిచేరాని నిపుణులు అంటున్నారు. 

పైగా ఆరోగ్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవటం.. ఆసుపత్రులకు వెళితే ప్రాణాలు మిగిలి ఆస్తులు కరిగిపోవటం సాధారణంగా మారిన ప్రస్తుత కాలంలో ప్రజలు కూడా తమ ఆరోగ్యం పట్ల ఫోకస్  పెట్టాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోడీ మాటలు చెప్పకనే చెబుతున్నాయి. ఇది పరోక్షంగా దేశ హెల్త్ బడ్జెట్ కూడా పెంచేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే నిపుణులు దీనిపై పాలసీ మార్పులు అవసరమని.. జంక్ ఫుడ్స్ మార్కెటింగ్ పై ఫోకస్.., స్కూల్ న్యూట్రిషన్ , బీఎంఐ ట్రాకింగ్ వంటివి అత్యవసరంగా చెబుతున్నారు.