OTTలోకి 'సైయారా'.. రొమాంటిక్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

OTTలోకి 'సైయారా'.. రొమాంటిక్ బ్లాక్ బస్టర్ మూవీ..  ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ బ్లాక్ బస్టర్ మూవీ 'సైయారా'.  ఈ చిత్రంలో  బాలీవుడ్ నటి అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే హీరోగా, అనీత్ పడ్డా హీరోయిన్ గా తొలిసారి నటించారు. ఈ మూవీ ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.  సినీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. 

నెట్ ఫ్లిక్స్ లో సైయారా విడుదల
సైయారా మూవీ థియేటర్లలో ఎనిమిది వారాల పాటు విజయవంగంగా ప్రదర్శించిన తర్వాత , దానిని OTTలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ  ఈ సినిమాకు చెందిన స్ట్రీమింగ్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సెప్టెంబర్ 12న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుందని వెల్లడించారు. ఎక్కువగా యశ్ రాజ్ ఫిల్మ్స్ ( YRF ) చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియాలో రిలీజ్ అవుతుంటాయి.  అయితే 'సైయారా' చిత్రం విషయంలో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడం ఆసక్తికరమైన విషయం.
 
బాక్సాఫీస్ వద్ద సునామీ
సినీ బాక్సాఫీస్ వద్ద సైయారా సునామీ సృష్టించింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 550 కోట్ల మేర వసూలు సాధించింది. దేశీయంగానే సుమారు 330 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది రెండో అతిపెద్ద హిందీ చిత్రంగా నిలిచింది. తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టిన కొత్త జంట నటించడం, ఈ చిత్రం అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడం మాములు విషయం కాదని సినీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.

►ALSO READ | క్యూట్ వీడియో: ఇంటిపై జెండా ఎగరేసిన రామ్ చరణ్.. క్లిన్కారాతో కలిసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్..

అజయ్ దేవగన్ , రితేష్ దేశ్‌ముఖ్ నటించిన "రైడ్ 2" వంటి పెద్ద సినిమాలను కూడా  "సైయారా" అధిగమించింది. ఈ ఏడాదిలో అతిపెద్ద చిత్రంగా నిలిచింది. ఒక నూతన నటీనటులతో, ఒక రొమాంటిక్ సినిమా ఈ స్థాయి విజయం సాధించడం అసాధారణమైన విషయం అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..