
79వ ఇండిపెండెన్స్ డేను (ఆగస్టు 15) దేశమంతా గర్వంగా సెలెబ్రేట్ చేసుకుంటోంది. వీధి చివర కుర్రాడి నుండి బార్డర్లో సైనికుడి వరకు కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లిన్కారాతో ఇండిపెండెన్స్ డే వేడుకను జరుపుకున్నారు. లేటెస్ట్గా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ “అందరికీ 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. జైహింద్” అని తెలిపారు.
ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకుని కనిపించాడు. అలాగే, తన కూతురు క్లిన్కారను ఎత్తుకుని ఎగురుతున్న జెండాకు సెల్యూట్ చేస్తూ ఆకర్షించారు.
ప్రతి ఏటా అయ్యప్ప మాల వేసుకునే చరణ్.. ఈ ఏడాది కూడా మాల ధరించడం విశేషం. ఈ వీడియో చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు వీడియో షేర్ చేస్తూ పోస్టులుపెడుతున్నారు. ‘క్యూట్ క్లిన్ కారా@.. చరణ్ అన్నపెద్దితో గట్టిగా కొట్టాలి.. జై హింద్..’అని తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.
Wishing everyone a Happy 79th Independence Day.
— Ram Charan (@AlwaysRamCharan) August 15, 2025
Jai Hind 🇮🇳 pic.twitter.com/KUfb3FzQw3
ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో నటిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.