లగ్గం టైంకు నవ్వడం గ్యారెంటీ

లగ్గం టైంకు నవ్వడం గ్యారెంటీ

రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో కె  హిమబిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’.  ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ కానుంది.   ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా  హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ ‘కథలో కొత్తదనంతో పాటు అందరినీ ఆట్టుకునేలా ఉంటుంది’ అని అన్నాడు.  దర్శకుడు ప్రజోత్ కె వెన్నం మాట్లాడుతూ ‘మేమంతా కొత్త వాళ్లమే అయినా  ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశాం. 

 ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు.  నిర్మాత కె. హిమబిందు మాట్లాడుతూ ‘ఈ సినిమాని చూసి థియేటర్ నుంచి మనస్ఫూర్తిగా నవ్వుతూ వెళ్లడం గ్యారెంటీ. రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వల్ల మాలాంటి చిన్న నిర్మాతలు తీస్తున్న చిత్రాలకు సరైన థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించడం లేదు.  అందుకే రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విషయంలో సినీ పెద్దలు ఆలోచించాలి’ అని చెప్పారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.