దేవాదాయశాఖలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు..

దేవాదాయశాఖలో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు..

ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 02. 

పోస్టుల సంఖ్య: 07 (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III దేవాదాయశాఖ) 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 42 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 13. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ ‌‌02. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడబ్ల్యూడీఎస్, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు రూ.80. ఇతరులకు రూ.330.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  psc.ap.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.